నర్సింహులపేట ఎస్ఐ సతీష్ పెట్టిన అక్రమ కేసు పై (క్వాష్) పిటిషన్ విచారణ..
అక్రమ కేసు పై ఈనెల 19న హైకోర్టులో క్వాష్ పిటిషన్… తదుపరి విచారణ జులై 15న… అరెస్టుపై స్టే…
ఎస్సైగండ్రాతి సతీష్ తో పాటు కానిస్టేబుల్ తప్పెట్ల రమేష్ కు నోటీసులు జారీ చేసిన హైకోర్టు..
మహబూబాబాద్ జిల్లా : నర్సింహులపేట ఎస్సై గండ్రాతి సతీష్ అకారణంగా ఒక విలేకరి, అతని తమ్ముడిని చితక బాధడంతో పాటు అతని సిబ్బందితో అక్రమ పోలీస్ కేసును పెట్టిన ఎస్సై గండ్రాతి సతీష్, కానిస్టేబుల్ రమేష్ చర్యలపై తెలంగాణ హైకోర్టులో ప్రాథమిక విచారణ నివేదికపై క్వాష్ పిటిషన్ దాఖలు అయింది.
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట ఎస్సైగా పనిచేస్తున్న గండ్రాతి సతీష్ గత నెల 15వ తేదీన నర్సింహులపేట పత్రిక విలేఖరిగా పనిచేస్తున్న మేకరబోయిన నాగేశ్వర్ అతని తమ్ముడిని.. నర్సింహులపేట నుండి పడమటిగూడెం వెళ్లే రోడ్డు వద్ద.. నర్సింహులపేట నర్సరీ వద్ద తీవ్రంగా కొట్టి, నర్సింహులపేట పోలీస్ స్టేషన్ లాక్ అప్ లో వేసి, రాత్రి 10:30 నుంచి ఉదయం 1:00 వరకు తీవ్రంగా కొట్టి చేతులు విరగొట్టి, బాధితులనే నిందితులు అంటూ వారిపైనే అక్రమ కేసులు పెట్టినారు. ఈ విషయమై బాధితులు ఈ నెల 19 న తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా క్వాష్ పిటిషన్ (సి.ఆర్.ఎల్. పి. నెం.) 4507/2024, తేదీ ఈనెల 20, 24 న విచారించిన హైకోర్టు.. చట్ట విరుద్ధంగా అదుపులోకి తీసుకొని లాక్ అప్ లో వేసి, చితకబాది ఇరువురిని గాయపరిచిన ఎస్ఐ సతీష్ పై ధర్మసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా, డివిజనల్ పోలీస్ అధికారులకు తెలపకుండా పోలీస్ స్టేషన్ లో లాకప్ లో వేసి, చిత్రహింసలకు గురిచేసినప్పటికీ జిల్లా, డివిజనల్ స్థాయి పోలీస్ అధికారులు స్పందించకపోవడంతో బాధితులు ఈ మేరకు హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ, డీజీపీ, ఎస్పీలకు సంబంధిత ఎస్సై సతీష్, పోలీస్ కానిస్టేబుల్ తప్పెట్ల రమేష్ లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల కోర్టుకు సెలవు కావడంతో జూన్ మాసంలో పూర్తి నివేదికతో పోలీస్ శాఖ వారు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్ల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించొద్దని, సంభందింత కేసుపై ఎటువంటి చర్యలనైనా నిలుపుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది.
అక్రమ కేసు బనాయించిన ఎస్ఐ సతీష్ ను సస్పెండ్ చేయాలి..
అక్రమ కేసు బనాయించిపెట్టిన ఎస్ఐ సతీష్ పై పోలీస్ కేసు నమోదు చేసి, వెంటనే విధుల నుండి తప్పించి, హత్య యత్నం కేసు నమోదు చేయాలని తెలంగాణ ప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డి. వై. గిరి డిమాండ్ చేశారు. బాధితులకు రూ. 10 లక్షలు నష్ట పరిహారం అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. మానవ హక్కుల కాలరాసిన ఎస్ఐ పై చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఇప్పటికే రాష్ట్ర, జిల్లా పోలీసులను కోరామని డి. వై. గిరి తెలిపారు. గత నెల 15 న నర్సింహులపేట ఎస్ఐ గండ్రాతి సతీష్ దాడి చేసి 42 రోజులు అయిన పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారణమని ఆవేదన ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే నిందితుడు అయిన ఎస్ఐ గండ్రాతి సతీష్ పై పోలీస్ కేసు నమోదు చేసి, శాఖపరమైన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఇద్దరినీ గాయపరిచి, తన తప్పును కప్పి పుచ్చుకొనే ప్రయత్నంలో భాగంగా ఎస్ఐ సతీష్ ను పోలీస్ అధికారులు కాపాడిన హైకోర్టు పరంగా చర్యలు తప్పవని ఆయన చెప్పారు.