రుణమాఫీ సాధ్యమేనా…!!  BRS కాంగ్రెస్ సవాళ్లు ప్రతి సవాళ్లు…!!

రుణమాఫీ సాధ్యమేనా…!!  BRS కాంగ్రెస్ సవాళ్లు ప్రతి సవాళ్లు…!!

రైతు బందు దిక్కులేదు — రుణమాఫీ ఎలా సాధ్యం!!

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9న 2 లక్షల రూపాయల రుణమాఫీ తో పాటు రైతుల అకౌంట్లో రైతుబంధు నిధులు ఎకరాకు 7500 రూపాయలు వెంటనే చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఇప్పటికీ అమలు కాకపోవడం మళ్లీ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కేవలం ఓట్ల కోసం ఆగస్టు 15 లోపు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని డంకాబజాయించి ముఖ్యమంత్రి ప్రతి బహిరంగ సభలో ప్రజలను రైతులను ఆకట్టుకునే విధంగా ప్రసంగిస్తున్నారు.

ముఖ్యమంత్రి ప్రసంగానికి కౌంటర్గా ప్రతిపక్ష పార్టీ అయినా BRS పార్టీ మాజీ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సవాలు విసిరారు.

రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

హరీష్ రావు సవాలకు ప్రతి సవాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఫార్మేట్ లో సిద్ధంగా పెట్టుకోమని ప్రతి సవాల్ విసిరారు.

ఈ విధంగా ఎన్నికల కోసం ప్రతిపక్షం అధికారపక్షం ఒకరిపై ఒకరు సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకోవడం ప్రజలను మభ్యపెట్టడం ఓట్లు దండుకోవడం ఎన్నికల తర్వాత ప్రజల నడ్డి విరవడం సర్వసాధారణంగా మారిపోతుంది.

ఏదిఏమైనా ఈసారి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం జనాకర్ష పథకాలను హామీలను సాధ్యం కాకపోయినా ఏదో ఒకటి చెప్పాలని ఉద్దేశంతో పకడ్బందీ ప్రణాళికతో ఎన్నికల్లో హామీలు ఇవ్వడం అధికారంలోకి రావడం జరిగింది.

కానీ రైతు బంధు నిధులు కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9 న 5000 కాకుండా 7500 ఇస్తామని కేసీఆర్ ఇచ్చే 5000 రూపాయలు తీసుకోకుండా ఉండాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఐదు వేలకు బదులు ఏడు వేల ఐదు వందలు మేము చెల్లిస్తామని నమ్మబలికి నట్టేట ముంచాడని విమర్శలు వస్తున్నాయి.

ఇప్పటివరకు రైతుబంధు నిధులు విడుదల చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ లెక్కలు చూపిస్తూ అందరికీ రైతుబంధు డబ్బులు విడుదల చేసినట్లు ప్రచారం చేయడం మళ్లీ తిరిగి తెరపైకి మరొక మోసం 2 లక్షల రూపాయల రుణమాఫీ కార్యక్రమాన్ని హామీని ఈ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రెండు లక్షల రుణమాఫీ హామీని బయట పెట్టడం గట్టిగా హామీ ఇవ్వడం మరో మోసానికి దారితీస్తుందని రాష్ట్ర ప్రజలు ఇప్పటికే గమనిస్తున్నారు.

అందుకే రుణమాఫీ సాధ్యం కాదనే విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ మాజీ మంత్రులు రుణమాఫీ సవాలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు, దశలవారీగా బ్యాంకులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలను మాఫీ చేస్తామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అది సాధ్యం కాదని ఆర్థిక నిపుణులు వ్యవసాయ నిపుణులు బ్యాంక్ అధికారులు అంటున్నారు.

కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్యాంకుల అప్పులు కార్పొరేషన్ కు బదిలీ చేయడం సాధ్యం కాదని కూడా కుండబద్దలు కొట్టి చెపుతున్నారు, ఎన్నికల కోసమే రుణమాఫీ హామీ తెరపైకి వచ్చిందని ప్రజలు అంటున్నారు.

ఇప్పటికీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అందులో ముఖ్యంగా రైతుబంధు నిధులు ఎంతమంది రైతులకు ఇచ్చిన సంగతి ఎన్ని ఎకరాల వరకు రైతుబంధు నిధులు విడుదల చేశారు స్పష్టంగా బయటపెట్టాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

పార్లమెంట్ ఎన్నికల తర్వాత వెంటనే స్థానిక సంస్థ ఎన్నికలు రావడం తథ్యం మళ్లీ ఆ ఎన్నికల్లో కూడా ప్రజలను మభ్యపెట్టి హామీలు మోసపూరితమైన ప్రకటనలు అధికార పార్టీ నాయకులు చేయడానికి కుట్ర పన్నుతున్నారని ప్రతిపక్ష పార్టీలు బలంగా ప్రజలకు తెలియజేస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని BRS పార్టీ నాయకులు కంకణం కట్టుకొని ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా రైతు వ్యతిరేక విధానాలను ఎండ కట్టడానికి సిద్ధమయ్యారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

3900 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తో తాను ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు తీసుకున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

దీని బట్టి చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఖజానాల్లో చిల్లి గవ్వ కూడా లేదని ఉన్న డబ్బులు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు మాత్రమే సరిపోతున్నాయని ఆసరా పెన్షన్లు రైతుబంధు నిధులు.

షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి, పథకాలతో పాటు గృహ లక్ష్మీ పథకం మహాలక్ష్మి పథకం తో పాటు మిగతా గ్యారెంటీ పథకాలకు నిధులు ఏ విధంగా వస్తాయో ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రం ఏ విధంగా చేస్తాడని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరో రెండు మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ప్రభుత్వానికి గడ్డు రోజులు తప్పవని విశ్లేషకులు అంటున్నారు.

ముఖ్యంగా రైతుబంధు నిధులను ఇప్పటివరకు విడుదల చేయని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన హామీలు అమలు చేయాలని రెండు లక్షల రుణమాఫీ లో ఎలాంటి కండిషన్లో షరతులు పెట్టకుండా అందరికీ రుణాలు మాఫీ చేయాలని అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం పై రాష్ట్ర ప్రజలు చిత్తశుద్ధితో నమ్ముతారని పలువురు అంటున్నారు.

ఏమి జరుగుతుందో ఆగస్టు 15 లోపు ఈ రాష్ట్రంలో ఒక సంచలనాత్మకమైన రాజకీయ సంక్షోభం రాక తప్పదని తెలుస్తుంది.

కేవలం ఎన్నికల హామీలు కాకుండా ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఈ సంవత్సరం 2024 డిసెంబర్ చివరి నాటికి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కి ప్రతిపక్షాల సవాల్ తప్పకుండా స్వీకరించక తప్పదు.