ఖమ్మం రోడ్డు షో అనంతరం మాజీ CM KCR గారి కామెంట్స్…

ఖమ్మం రోడ్డు షో అనంతరం మాజీ CM KCR గారి కామెంట్స్…

ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ను అత్యధిక మెజారిటీతో గెలిపించండి.

ఈ రోజు ఖమ్మం లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత ఎండ ఉన్నా కూడ సభకు వచ్చినందుకు ధన్యవాదాలు.

నామ నాగేశ్వరరావు నాకు ఒక మాట చెప్పారు. ఆయన జిల్లా, మన రాష్ట్రం బాగుపడాలని కోరిక.

పంజాబ్ కంటే ఎక్కువగా మనం ధాన్యం పండించాం. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయమని చెప్పింది, తెలంగాణ క్యాబినెట్ మొత్తం వెళ్లి ఢిల్లీ లో ధర్నా చేశాం.

నాడు ఒక్క బీజేపీ ఎంపీ కానీ, కాంగ్రెస్ ఎంపీ కానీ ఒక్కరు నోరు తెరవలేదు.

బీజేపీ నుండి తెలంగాణ రాష్ట్రంలో ఒక కేంద్రమంత్రి ఉన్నదుజ్ ముగ్గురు ఎంపీ లు ఉన్నారు తెలంగాణ రాష్ట్రం గురించి మాత్రం మాట్లాడరు.

సీఎం రేవంత్ రెడ్డి వంటి దద్దమ్మలు మనకు ఎందుకు. ఖమ్మం జిల్లా ఇబ్బందులు శాశ్వతంగా పూర్తి కావాలని దుమ్ముగూడెం ప్రాజెక్ట్ నిర్మాణం చేశాం.

నేను సీఎం గా ఉన్న సమయంలో నరేంద్ర మోడీ ఇటువంటి ప్రతి పాదన తెచ్చాడు, మా రాష్ట్రం కు చెందిన నీటిని ముట్టుకునే సమస్య లేదని తెగేసి చెప్పా.

కేంద్రంలో బీజేపీ 400 సీట్లు, 370 సీట్లు గోవిందా, 200 సీట్లు కూడా దాటని పరిస్థితి.

తెలంగాణ రాష్ట్రంలో మనం 12 సీట్లు గెలవబోతున్నాం. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుంది మనం ఎంపీ గా నామాను గెలిపిస్తే నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి అవుతారు.

బీఆర్ఎస్ అయితేనే పేగులు తెగే వరకు పోరాటం చేస్తుంది.

నేను ఆమరణ దీక్షకు పూనుకుంటే నన్ను ఖమ్మం తీసుకుని వచ్చారు.

అప్పుడు న్యూడెమోక్రసి, విద్యార్థి సంఘాలు నాకు బ్రహ్మరథం పట్టారు.

రైతులకు 24 గంటలు కరెంట్ కల్పించాం, రైతు పండించిన పంటను కొనుగోలు చేశాం.

సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు.

ఎన్టీఆర్ వచ్చిన తర్వాతనే రాష్ట్రంలో సంక్షేమ పాలన వచ్చింది.

అనేక మంచి కార్యక్రమాలు నిజమైన సంక్షేమం కాంగ్రెస్ చేయలేదు, ఎన్టీఆర్ సమయంలో జరిగింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్టీఆర్ నీ మించి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాం.

రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి పథకం పెట్టుకున్నాం, సిఎం కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అన్నారు.

ఇప్పుడు అడిగితే చెప్పుతో కొడతా అంటున్నారు, ఆయనకు నేను చెప్పేది ఒకటే ప్రజలతో పెట్టుకుంటే నాశనం అవుతారు.

బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కరోజు కరెంట్ పోలేదు,కాంగ్రెస్ వచ్చాక నిత్యం కరెంట్ కోతలే.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కాదు, ఆయన వట్టి విక్రమార్క..

కాంగ్రెస్ ప్రభుత్వం ఒస్మానియా యూనివర్సిటీ కి నీళ్లు ఇచ్చే దిక్కు లేదు.

బీఆర్ఎస్ ప్రభుత్వం లో వరి కోతలు, కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోతలు.

రైతులకు రెండు లక్షల రుణ మాఫీ చేస్తానని ఇంతవరకు చేయలేదు.

మాజీ మంత్రి హరీష్ రాజీనామా చేసిండు, నువ్వు అలా చేయగలవా రేవంత్ రెడ్డి.

సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని నేను ప్రశ్నిస్తే నిన్ను జైల్ లో వేస్తా, కళ్ళు గుడ్డు పీకుతా అని బెదిరిస్తున్నారు.

జైల్ లో వేస్తా అంటే భయపడే వ్యక్తి కాదు కేసిఆర్. కాంగ్రెస్ నాయకులు వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటున్నారు, బీజేపీ వాళ్లు పార్లమెంట్ ఎన్నికల తెల్లారే ప్రభుత్వం ఫాం చేస్తామని స్టేట్ మెంట్ కు ఇస్తున్నారు.

నాగార్జున సాగర్ లో 432 అడుగుల నీరు ఉన్న పంటలకు నీరు అందించలేని స్థితిలో కాంగ్రెస్ ఉంది.

నేలకొండపల్లి మండలంలో పంటలు ఎండిపోయాయి అని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి బాధపడుతున్నారు.

రైతులకు రైతు బంధు రాలేదు సంక్షేమ పథకాల అమలు కోసం పోరాడదాం.

రైతు బంధు మేము బుర్ర లేకుండా పెట్టలేదు, ప్రపంచ వ్యాప్తంగా సబ్సిడీ లేకుండా ఎటువంటి కార్యక్రమం జరగలేదు అందుకే రైతు బంధు పథకం పెట్టాం.

కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది 5 ఎకరాలు ఉన్నవారికే రైతు బంధు ఇస్తాం అంటున్నారు, 6 ఎకరాలు ఉన్నవారు కోటీశ్వరుల.

ఖమ్మం నగరంలో మూడు రోజులకు ఒకసారి మంచి నిరు వస్తుంది, మన పాలనలో నిత్యం నిల్లు ఇచ్చాం.

ఇద్దరు మంత్రులు ఉన్న రైతుల పంటలకు నీళ్ళు ఎందుకు ఇవ్వలేదు, రైతులు పాలేరు జలాశయానికి వచ్చి బద్దలు కొడతా అన్నారు.

బీఆర్ఎస్ హయాంలో ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు ఒక్కో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశాం.

పెద్ద స్థాయిలోకి వెళ్ళే అవకాశం నామా నాగేశ్వరరావుకు ఉంది ఆయన కు ఓట్ వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించండి.

BRS ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కామెంట్స్..

ఖమ్మం జిల్లాలో కని విని ఎరుగని రీతిలో రోడ్ షో జరిగింది.

ఇంతలా ఏ సభలకు కూడా ఇంతలా జనాలు రాలేదు.

ఎన్టీఆర్ ఆశీస్సులతో నన్ను ఎంపీ గా ఎన్నుకున్నారు.

అలానే కేసిఆర్ నన్ను ఆదరించి ఎంపీ అభ్యర్థిగా పోటీ చెపించారు.

నేను గెలిచిన తర్వాత నీళ్ళ, నిధులు నియామకాల కోసం పార్లమెంట్ లో కొట్లాడను.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని చిన్న చూపు చూసింది.

మెడికల్ కళాశాలల మంజూరు, నవోదయ స్కూల్ ల కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి మంజూరు చేయలేదు.

మన నాయకుడు కేసిఆర్ రైతుల పక్షపాతి ఆయన రైతులకు 24 గంటల కరెంటు, నీళ్లు అందించి రైతులకు అండగా నిలిచారు.

తెలంగాణ గొంతుక పార్లమెంట్ లో వినిపించాలి అంటే మీ బిడ్డను ఆశీర్వదించి మరొకసారి గెలిపించి పార్లమెంట్ కు పంపించాలి.

బీఆర్ఎస్ ఎంపి లు మాత్రమే తెలంగాణ రాష్ట్రం గురించి పార్లమెంట్ లో మాట్లాడతారు

గత ఎన్నికల్లో బీజేపీ 4, కాంగ్రెస్ 3 గెలుపొందారు కానీ ఏ రోజు పార్లమెంట్ లో తెలంగాణ గురించి మాట్లాడలేదు.

బీజేపీ, కాంగ్రెస్ నాయకులను నేను నోరు తెరిచి తెలంగాణ రైతు సమస్యల గురించి మాట్లాడాలని కానీ వారు మాత్రం దాన్ని అంగీకరించలేదు.

ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించండి.