అమెరికాలో తెలుగు కుటుంబం దాతృత్వం… పిల్లల హాస్పటల్‌కి రూ.417 కోట్లు విరాళం
అమెరికాలో స్థిర పడిన తెలుగుకుటుంబం గొప్ప మనసు చాటుకుంది. అమెరికాలో పిల్లల ఆస్పత్రి అభివృద్ది కోసం రూ.417 కోట్లు విరాళం ఇచ్చింది. డా.పగిడిపాటి దేవయ్య-రుద్రమ్మ కుటుంబం తమ 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ విరాళాలు అందజేశారు.
స్థానికంగా ఉన్నా సెయింట్ జోసఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఫౌండేషన్‌కు రూ. 417కోట్లు (50మిలియన్ డాలర్లు) విరాళంగా అందజేశారు. డా. పగిడిపాటి కుటుంబ సభ్యులు సిద్ధార్థ, అమీ, రాహుల్, నేహా, సృజని, అర్జున్, ఇషాన్, ఆరియా, అరెన్లు కూడా ఈ విరాళానికి తమవంతుగా సహకరించారు. ఈ విరాళం టంపాలో ఆరోగ్య సంరక్షణకు ఇప్పటి వరకు ఇచ్చిన అతిపెద్ద విరాళాల్లో ఒకటిగా చరిత్రలో నిలిచింది.
పగిడిపాటి దేవయ్య వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు. 1970లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలో పీజీ ఫెలోషిప్ పూర్తిచేసిన దేవయ్య భారతదేశం గర్వించదగ్గ వైద్యుడిగా ఎదిగారు.
దేవయ్య తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్‌లలో కంపెనీలు పెట్టి యువతకు ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పించారు. 35 సంవత్సరాలు అమెరికాలో ఉన్నపటికీ అమెరికా పౌరసత్వం తీసుకోలేదు. పేదలకు సేవా చేయాలనే ఉద్దేశంతో మదర్ థెరిసా హెల్పింగ్ హాండ్స్ అనే సంస్థను స్థాపించి ఎంతో మంది పేద వాళ్లకు దేవయ్య అండగా నిలిచారు.