తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు.
70 ఏళ్లు వచ్చినయ్ దుర్మార్గుడా? నాకు అపాయింట్మెంట్ ఇవ్వావా? అని రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తెలంగాణ రాష్ట్రంలో అడుగడున తెలిసినటువంటి నాకు అపాయింట్మెంట్ ఇవ్వవా? అంత మొగోడివా నువ్వు అని మండిపడ్డారు.
ఎన్ని రోజులు ఉంటావు నువ్వు? ఎన్ని రోజులు రాష్ట్రాన్ని పాలిస్తావో చూస్తాం.. కర్రు కాల్చి వాత పెడతారు నీకు నా మాదిగ సోదరులు అన్నారు. 80 లక్షలున్న నా మాదిగలకు ఒక్క టికెట్ ఇవ్వకుండా, పట్టుమని 10 మంది ఉన్న వేరే కులాలకు టికెట్ ఇస్తావా దుర్మార్గుడా? ఏ రకంగా ఇది న్యాయం.. ఎవడివో పేగులు మెడలేసుకుంటావా? అరేయ్ పొట్టి దొర నన్ను బెదిరిస్తావా? చాతకాని వెధవవి నువ్వు అంటూ రేవంత్ రెడ్డిపై మోత్కుపల్లి నర్సింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు.