పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని ప్ర‌జ‌లు కాటేయ‌బోతున్నారు… KCR సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని ప్ర‌జ‌లు కాటేయ‌బోతున్నారు… KCR సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

హైద‌రాబాద్ :

ఈ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్ర‌జ‌లు కాటేయ‌బోతున్నార‌ని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీని కాటేయ‌డం ఖాయం.. అందులో ఎలాంటి అనుమానం లేదు.. ప్ర‌జ‌లు కూడా తీవ్ర ఆగ్ర‌హాంతో ఉన్నార‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.

పార్ల‌మెంట్‌ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా 17 రోజుల బ‌స్సు యాత్ర చేప‌ట్టాను. ఆ త‌ర్వాత జ‌నం నుంచి వ‌చ్చిన స్పంద‌న‌లు, మ‌ధ్యాహ్నాం స‌మ‌యంలో జ‌నం ఇచ్చిన స‌మాచారం ద్వారా తెలుస్తున్న‌ది ఏందంటే ఈ ఎన్నిక‌ల్లో రెండు జాతీయ పార్టీల‌ను మించి ఎక్కువ స్థానాల్లో బీఆర్ఎస్ అద్భుతంగా గెల‌వ‌బోతుంది. ఇందులో సందేహం లేదు. ఈ రెండు ప్ర‌భుత్వాల ఆచ‌ర‌ణ‌, అవ‌లంభించిన త‌ప్పుడు విధానాలు ప్ర‌జ‌ల్లోకి వెళ్లాయి. వాటిని మేం చెప్ప‌గ‌లిగాం. దాని ఫ‌లితమే బీఆర్ఎస్ అద్భుత‌మైన విజయం సాధించ‌బోతుంది అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

శాస‌న‌స‌భ‌లో కూడా చిలిపి ప్ర‌య‌త్నాలు..

కాంగ్రెస్ పార్టీకి చెందిన అర్భ‌క ముఖ్య‌మంత్రి ఆధ్వ‌ర్యంలో ఈ ప్ర‌భుత్వం చాలా త‌ప్పులు చేసింది. ఎప్పుడు కానీ ఇంత‌కుముందు ఉన్న ప్ర‌భుత్వం మారి వేరే ప్ర‌భుత్వం కొలువు దీరిన‌ప్పుడు గ‌త ప్ర‌భుత్వం ఏ విధానాలో అవలంభించిందో ఇంట‌ర్న‌ల్ స‌మీక్ష‌లు చేసి మెరుగైన ప‌నిత‌నం చూపించాలి. ఇది స‌హ‌జంగా క‌నిపించేదే. భిన్నంగా అస‌హ‌జ‌మైన ప‌ద్ధ‌తుల్లో ఒక‌ పాల‌సీ లేకుండా, రైతులు, ఇండ‌స్ట్రీ, ప‌వ‌ర్, ఇరిగేష‌న్ సెక్టార్‌ను ప‌క్క‌న పెట్టి అమూల్య‌మైన స‌మ‌యాన్ని చిల్లర రాజ‌కీయాల కోసం వేస్ట్ చేశారు. శాస‌న‌స‌భ‌లో కూడా చిలిపి ప్ర‌య‌త్నాలు చేశారు. శ్వేత పత్రాలు విడుద‌ల చేసి, చ‌ర్చ పెట్టి ప్ర‌తిప‌క్షాన్ని తుల‌నాడ‌టం, మాట్లాడ‌ని భాష మాట్లాడి ఒక అక్క‌సు వెల్ల‌గ‌క్కి ప్ర‌తిప‌క్షాన్ని దెబ్బ‌తీసే చిల్ల‌ర రాజ‌కీయ ప్ర‌య‌త్నానికి పాల్ప‌డ్డారు. రాష్ట్ర అభివృద్ధి, ప్ర‌జ‌ల సంక్షేమంపై అతి త‌క్కువ దృష్టి పెట్టారు. ఆ వైఫ‌ల్య‌మే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోబోతుంది. వారు చేసిన త‌ప్పే వారిని కాటేయ‌బోతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ప్ర‌జ‌లు చాలా ఆగ్ర‌హంతో ఉన్నారు. ఆ ఆగ్ర‌హాంతో పార్టీని ముంచేయ‌డం ఖాయం అని కేసీఆర్ అన్నారు.

సీఎం స‌భ‌ల్లో ఇబ్బ‌డిముబ్బ‌డిగా కుర్చీలు ఖాళీ..

సుదీర్ఘ‌మైన రాజ‌కీయ అనుభ‌వంతో చెబుతున్నా.. జాతీయ పార్టీల ఓట‌మి స్ప‌ష్టంగా క‌న‌బుడుతుంది. అధికారంలో ఉండే పార్టీ అగ్ర నాయ‌కులు రాహుల్ గాంధీ వ‌స్తే స‌రూర్‌న‌గ‌ర్ స్టేడియంలో ఎంత అభాసుపాలు అయ్యారో చూశాం. మూడు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల సంయుక్త స‌మావేశంలో 3 వేల మందిని స‌మీక‌రించ‌లేక‌పోయారు. రాహుల్ గాంధీ బ‌స్సులోనే కూర్చోవ‌డం సీఎం బ‌తిమాలికోవ‌డం చూశాం. వ‌చ్చిన డీసీఎంల‌లో జ‌నాల‌ను తొంద‌ర‌గా స్టేడియంలోకి పంపించ‌డం జ‌రిగింది. అది కూడా చూశాం. కాంగ్రెస్ ఓట‌మికి ఇది స్ప‌ష్ట‌మైన సంకేతం. అగ్ర నాయ‌కుడు వ‌చ్చిన‌ప్పుడు సీఎం స‌భ‌ల్లో ఇబ్బ‌డిముబ్బ‌డిగా కుర్చీలు ఖాళీగా ఉండంటం సంకేతం. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉన్న జోష్ కొర‌వ‌డింది. ప్ర‌జాస్పంద‌న శూన్యంగా ఉంది అని కేసీఆర్ పేర్కొన్నారు..

రుణ‌మాఫీ ఏ ఆగ‌స్టు 15కు..?… స‌ర్కార్‌ను నిల‌దీసిన కేసీఆర్

హైద‌రాబాద్ : రైతుల రుణ‌మాఫీపై రేవంత్ స‌ర్కార్‌ను బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిల‌దీశారు. ఏ ఆగ‌స్టు 15కు మాఫీ చేస్తారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కేసీఆర్ మాట్లాడారు.

డిసెంబ‌ర్ 9న ప‌దిన్న‌ర గంట‌ల‌కు రుణ‌మాఫీ చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. చాలా బాధాక‌రం అనిపిస్తుంది.. సీఎం మాట్లాడాల్సిన మాట కాదు అది. ఆయ‌న ధైర్య‌మా.. అర్భ‌క‌త్వామా.. తెలివి త‌క్కువత‌న‌మా అనేది అర్థం అయిత‌లేదు. ఒక సంవత్స‌రం దోపిడీని ఆపేస్తే రూ. 40 వేల కోట్లు రుణ‌మాఫీని ఎడ‌మ చేతితో మాఫీ చేస్తాను అంటుండు రేవంత్ రెడ్డి. ఇందుకు సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో చూశాను. ఒక వ్య‌క్తి మూర్ఖ‌త్వానికి అవ‌ధులు ఉంటాయి. మీడియా ముందు ఒళ్లు మ‌రిచి మాట్లాడ‌కూడ‌దు. ఇది సోష‌ల్ మీడియా యుగం. జాగ్ర‌త్త‌గా మాట్లాడాల‌ని కేసీఆర్ హెచ్చ‌రించారు.

వ‌చ్చే ఏడాది ఆగ‌స్టు అంటే అప్పుడు ఏం చేయాలి..

ఏ ఊరుకు పోతే ఆ దేవుని మీద ఒట్టు పెట్టుకోవ‌డం అల‌వాటు అయిపోయింది. రైతు రుణ‌మాఫీకి డిసెంబ‌ర్ 9 పోయింది. ఇప్పుడు ఆగ‌స్టు 15 అని అంటుడు. మ‌రి తెలివిగా ఏ ఆగ‌స్టు 15 చెప్ప‌డం లేదు. అర్థ‌మైత‌లేదు. వ‌చ్చే ఏడాది ఆగ‌స్టు అంటే అప్పుడు ఏం చేయాలి. బ‌స్సు యాత్ర చేస్తున్న‌ప్పుడు మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో చాలా మంది రైతులు క‌లిశారు. రైతుల అడ్వాన్స్‌గా అనుమానం వ్య‌క్తం చేశారు. ఏ ఆగ‌స్టు అని అడిగారు అని కేసీఆర్ గుర్తు చేశారు.

వ్య‌వ‌సాయ రంగాన్ని పూర్తిగా నిర్ల‌క్ష్యం

వ్య‌వ‌సాయా రంగాన్ని పూర్తిగా నిర్ల‌క్ష్యం చేసింది కాంగ్రెస్ ప్ర‌భుత్వం. ఈ ప్ర‌భుత్వం రావ‌డ‌మే మాకు శాపంగా మారింద‌ని రైతులు భావించారు. రైతు భ‌రోసా, రుణ‌మాఫీ లేదు. ఒట్లు పెట్టుకోవ‌డం పెద్ద జోక్ అయిపోయింది. కేసీఆర్ మీద తిట్లు దేవుళ్ల మీద‌ ఒట్లు త‌ప్ప ఏం లేదు. పంట‌లు ఎండిపోయాయి. అక్క‌డ‌క్క‌డ పండిన ధాన్యాన్ని కూడా కొంట‌లేరు. చెరువులు, చెక్ డ్యామ్‌లు నింప‌లేదు. బోర్లు వేసి ల‌క్ష‌ల రూపాయాలు వేస్ట్ చేసుకున్నారు రైతులు. భూగ‌ర్భ జ‌లాలు ప‌డిపోయాయి. సాగు నీళ్లు ఇవ్వ‌క‌పోవ‌డంతో పంట‌లు ఎండిపోయాయి. చెరువుల్లో నీళ్లు లేక చేప‌లు చ‌నిపోయాయి. ఇదంతా షార్ట్ పీరియ‌డ్‌లో జ‌రిగిపోయింది. చేప‌లు ప‌ట్టుకోవ‌డం ఇబ్బందిగా మారింది నీళ్లు వ‌ద‌లాల‌ని గ‌తంలో మ‌మ్మ‌ల్ని అడిగారు. ఇప్పుడేమో నీళ్లు లేక చేప‌లు చ‌నిపోయాయ‌ని కేసీఆర్ తెలిపారు.

బోన‌స్ బోగ‌స్ అయింది..

ధాన్యానికి క్వింటాల్‌కు బోన‌స్ 500 ఇస్తామ‌న్నారు. బోన‌స్ మాట‌నే లేదు. బోన‌స్ బోగ‌స్ అయింది. రైతులు ఆగ్ర‌హం మీద ఉన్నారు. బోన‌స్ ప‌క్క‌న పెడితే మ‌ద్ద‌తు ధ‌ర ఇప్పించ‌మ‌ని రైతులు అడుగుతున్నారు. ఈ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ఆగ్ర‌హానికి గురికాబోతోంది. వాళ్ల దుష్ప్ర‌ప‌రిపాల‌న వారికి శాపంగా మారుతుందన్నారు కేసీఆర్.

రైతుబంధు ఎగ‌బెట్టాల‌ని కుంటిసాకులు
రైతుబంధు విష‌యంలో రైతుల‌ను క‌న్ఫ్యూజ్ చేస్తున్నారు. ఏదైనా ప‌థ‌కం అమ‌లు చేస్తే దాని గురించి ప్ర‌భుత్వం కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పాలి. రైతుబంధు విధానం మారుస్తామ‌ని, సాగు చేసినోడికే రైతుబంధు వేస్తామంటున్నారు. రైతుబంధు ఇవ్వ‌కుండా ఎగొట్టాల‌ని చూస్తున్నారు. రైతుబంధు అమ‌లు చేస్తే రూ. 22 వేల కోట్లు వేయాలి. దానికి భ‌య‌ప‌డి ఎగ‌బెట్టాల‌ని కుంటిసాకులు చెబుతున్నారు. శాటిలైట్ ద్వారా ప‌రిశీలించి.. పంట సాగు చేసినోడికే ఇస్తామంటున్నారు. పంట వేసిన‌ట్లు మ‌ళ్లీ వ్య‌వ‌సాయ అధికారులు స‌ర్టిఫికెట్లు ఇవ్వాలి.. మ‌ళ్లీ లావో అంట‌రు. రేపు రైతుబంధును పెయిల్యూర్ చేయాల‌ని ప్ర‌భుత్వం ఉన్న‌ద‌ని రైతుల‌కు తెలిసిపోయింది. కాంగ్రెస్ నేత‌లు డ్రామాలు ఆడుతున్నారు అని కేసీఆర్ నిప్పులు చెరిగారు.

ఆరోగ్య శ్రీ, ఫీజు రియింబ‌ర్స్‌మెంట్ కొన‌సాగించాం..

రాజ‌శేఖ‌ర్ రెడ్డి మీద కోపంతో ఆప‌లేదు కదా..? : కేసీఆర్

హైద‌రాబాద్ : స్వ‌ర్గీయ ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి మీద కోపంతో త‌మ ప్ర‌భుత్వం ఆరోగ్య శ్రీ, ఫీజు రియింబ‌ర్స్‌మెంట్ ఆప‌లేదు క‌దా..? ఆ రెండు ప‌థ‌కాల‌కు అడిష‌న‌ల్ నిధులు కేటాయించి ముందుకు తీసుకెళ్లామ‌ని బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలిపారు. ఈ రెండు ప‌థ‌కాల వ‌ల్ల ఎంతో మందికి ల‌బ్ధి చేకూరింద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.

ఈ రాష్ట్రంలో మేధావుల‌కు, నాకు వ్య‌క్తితంగా ఇబ్బంది క‌లిగించిన అంశం ఏంటంటే.. రాష్ట్ర భ‌విష్య‌త్‌ను కాంక్షించే ఏ ప్ర‌భుత్వం కూడా అంత బాధ్య‌తారాహిత్యంగా ఉండ‌రు. రాష్ట్రం దివాళా తీసింద‌ని ఏ పిచ్చి ముఖ్య‌మంత్రి కూడా చెప్పాడు. అది స్టేట్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేస్తుంది. రాష్ట్రానికి దీర్ఘ‌కాలిక ప్ర‌యోజ‌నాల‌ను దెబ్బ‌కొడుతోంది. రాక్ష‌స ఆనంద‌రం కోసం, సంతోషం కోసం తాత్కాలికంగా ఆ నిమిషం వ‌ర‌కు ఉప‌యోగ‌ప‌డొచ్చు. రాష్ట్రానికి పెట్టుబ‌డులు ఆశించే దృష్ట్యా రాష్ట్రం బాగుంద‌ని చెప్పాలి. నేను సీఎం అయ్యాక తెలంగాణ ధ‌నిక రాష్ట్రం అని చెప్పి నిరూపించాను. ధ‌నిక రాష్ట్ర‌మ‌ని చెబుతూ ఆ దిశ‌గా ప‌య‌ని…