దేశానికి తలమానికం… KCR నిర్మించిన పలు నిర్మాణాలలో సచివాలయానికి జాతీయ చానెళ్లు ఫిదా..

లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా హైదరాబాద్‌కు క్యూ కట్టిన జాతీయ చానెళ్లు

ప్రత్యేక ఇంటర్వ్యూలన్నీ సచివాలయం కనిపించేలా ఏర్పాట్లు’ఇండియా టుడే, టైమ్స్‌ నౌ’ తదితర నేషనల్‌ చానెళ్లలో వ్యూ పాయింట్‌గా సచివాలయం

తమిళనాడు చీఫ్‌ అన్నామలై ప్రత్యేక ఇంటర్వ్యూలోనూ మెరిసిన సచివాలయం: ఉద్యమ నేత కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణలో ఎన్నో అద్భుత కట్టడాలు, చారిత్రక నిర్మాణాలు చేపట్టింది. రాష్ర్టానికే కాకుండా యావత్తు దేశానికే గర్వకారణంగా నిలిచిన ఆ నిర్మాణాల ఖ్యాతిని చాటుతూ, ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ టీవీ చానళ్లు ప్రత్యేక కథనాలను ప్రసారం చేసిన విషయం తెలిసిందే. అలాంటి విశిష్టమైన కట్టడాల్లో ఒక్కటైన సచివాలయం ప్రస్తుతం మరోసారి వార్తల్లోకెక్కింది. తెలంగాణ సచివాలయం.. ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ చానెళ్ల్లను మరోసారి ఆకర్శించింది. లోక్‌ సభ ఎన్నికల దృష్ట్యా ఇటీవల చానెళ్లు అన్నీ హైదరాబాద్‌కు క్యూ కట్టాయి. ఇంకనూ వస్తూనే ఉన్నాయి. తెలంగాణ ఇతివృత్తంగా చెబుకునే కట్టడాలను బ్యాక్‌గ్రౌండ్‌గా చేసుకొని ఆయా చానళ్లు ప్రత్యేక ఇంటర్వ్యూలు, రాజకీయ కథనాలు చేస్తున్నాయి.

అయితే, వీటన్నింటికి ఓ వ్యూ పాయింట్‌గా తెలంగాణ సచివాలయాన్ని ఎంచుకోవడం విశేషం. బ్యాక్‌ గ్రౌండ్‌లో ఆ అద్భుత నిర్మాణం తమ టీవీ చానెళ్లలో కనిపించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జాతీయ చానెళ్లు తెలంగాణ రాజకీయాలపై రూపొందిస్తున్న స్టోరీలు, ప్రోమోలలో కేసీఆర్‌ నిర్మించిన సచివాలయం.. హైదరాబాద్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా చూపిస్తున్నారు. ‘ఇండియా టుడే, టైమ్స్‌ నౌ, హిస్టరీ 18’ తదితర జాతీయ, అంతర్జాతీయ చానెళ్లు హైదరాబాద్‌లో ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీలు చేశాయి.

ఆ కథనాల్లో తెలంగాణ సచివాలయాన్నే ప్రధాన వేదికగా చేసుకుని తమ టీవీలో ప్రత్యేక ఆకర్శణగా ప్రసారం చేశారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా బుధవారం నిర్వహించిన తమిళనాడు చీఫ్‌ అన్నామలై ఇంటర్వ్యూను హుస్సేన్‌ సాగర్‌ లేక్‌ బోటులో ఏర్పాటు చేసింది. అయితే, ఈ ఇంటర్వ్యూలో వ్యూ పాయింట్‌గా తెలంగాణ సచివాలయాన్ని ప్రత్యేకంగా ఆ చానెళ్లు చూపించడం విశేషం. మరో చానెల్‌ ‘టైమ్స్‌ నౌ’ కూడా రాజకీయ కథనాలు చేస్తూ తెలంగాణ సచివాలయాన్నే ప్రధాన వేదికగా చూపించడం విశేషం. దీంతో పాటు ‘హిస్టరీ టీవీ 18’ జాతీయ చానెల్‌ అమరవీరుల స్మారక స్థూపం, కట్టడంపై ప్రత్యేక కథనం చేసి కేసీఆర్‌ పాలనకు కితాబునిచ్చింది.

సచివాలయ నిర్మాణానికి దేశం ఫిదా..!

తెలంగాణ సచివాలయం. అది 28 ఎకరాలల్లో సువిశాల ప్రాంగణం. 10.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునికంగా రూపుదిద్దుకున్న భవనం. విభిన్న సంస్కృతులకు అద్దం పట్టే నిర్మాణ శైలుల్లో వెలిసిన కట్టడం. తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో 875కి పైగా తలుపులున్నాయి. అన్నింటినీ టేకుతోనే తయారు చేశారు. ఇండో పర్షియన్‌ – అరేబియన్‌ నిర్మాణాల మిశ్రమ శైలి సచివాలంయలో కనిపిస్తుంది. సచివాలయం ప్రారంభం నుంచే 26 నెలల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించారు. ఈ సచివాలయాన్ని చూసి ప్రతి ఒక్కరు మురిసిపోయేలా నిర్మించారు. హైదరాబాద్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఆ నిర్మాణం తల ఎత్తుకుని నిల్చొన్నట్టుగా ఉందం టూ నిపుణులు తమ అభిమానాన్ని చాటుకున్నారు.

హైదరాబాద్‌కు వచ్చే జాతీయ, అంతర్జాతీయ వ్యక్తులు ఎవ్వరైనా తమ డెస్టినేషన్‌ లిస్టులో కేసీఆర్‌ నిర్మించిన సచివాలయం, అమరవీరుల స్థూపం, అతిపెద్ద అంబేద్కర్‌ విగ్ర హం ప్రధానంగా ఉంటున్నాయని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని.. అద్భు త నిర్మాణాన్ని సాధ్యం చేసిన కేసీఆర్‌కు ప్రతి ఒక్కరు హ్యాట్సాఫ్‌ చెబుతూ.. సోషల్‌ మీడియాలోనూ పోస్టులు పెడుతున్నారు. కేసీఆర్‌ నిర్మించిన ఈ అద్భు త కట్టడాలను వీక్షించేందుకు కాంగ్రెస్‌, బీజేపీకి చెందిన ఇతర రాష్ర్టాల నాయకులు సైతం క్యూ కడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొని కాలక్షేపంగా ఆ నిర్మాణాలు వీక్షించి చర్చించుకుంటున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.