బ్రిటన్ పార్లమెంట్‌ బరిలో మనోడే

బ్రిటన్ పార్లమెంట్‌ బరిలో మనోడే

లేబర్‌ పార్టీ అభ్యర్థిగా ఉదరు నాగరాజు

కరీంనగర్‌ జిల్లా :

బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణవాసి బరిలో నిలి చారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదరు నాగరాజు లేబర్‌ పార్టీ నుంచి ఎన్నికల పోటీలో నిలుస్తునారు.

నార్త్‌ బెడ్‌ ఫోర్డ్‌ షైర్‌ లేబర్‌ పార్టీ తమ పార్లమెంటరీ కాండిడేట్‌గా నాగరాజు పేరు ప్రకటించింది. నార్త్‌ బెడ్‌ ఫోర్డ్‌ షైర్‌ ‘బౌండరీకమిషన్‌’ సూచనతో కొత్తగా ఏర్పడ్డ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీకి దిగారు.

ప్రఖ్యాత సర్వే సంస్థ ఎలక్టో రల్‌ కాల్కులస్‌ ప్రకారం.. నియోజకవర్గంలో 68 శాతం లేబర్‌ పార్టీ గెలవబోతుం దన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం బ్రిటన్‌లోనూ ఎన్ని కల హడావిడి మొదలైంది.

భారత దేశంలో ఇప్పటికే ఎన్నికలు జరుగుతుండగా ఈ సంవత్సరంలోనే బ్రిటన్‌, అమెరికాలోనూ ఎన్నికలు ఉన్నాయి. రష్యా -ఉక్రెయిన్‌ యుద్ధం, ఇజ్రాయిల్‌ -పాలస్తీ నా సంఘర్షణ, ప్రపంచవ్యా ప్తంగా ఆర్థికమాంద్యం ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో జరుగుతున్న బ్రిటన్‌, అమెరికా ఎన్నికల మీద ప్రపంచ దేశాల దృష్టి కేంద్రీకృతమైంది.

మధ్యతరగతి కుటుంబం నుంచి యూకే బరిలో..
శనిగరం గ్రామంలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన హనుమంతరావు- నిర్మలాదేవి దంపతులకు ఉదరు నాగరాజు జన్మించారు.

చిన్నప్పటి నుంచే కష్టపడే తత్వం కలిగి ఉండే ఉదరు అంచెలంచలుగా ఎదిగారు. బ్రిటన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజీ అఫ్‌ లండన్‌లో పాలనాశాస్త్రంలో పీజీ చేశారు.

ప్రపంచ సమాజం, భావిత రాలపై ఆర్టిఫిషియల్‌ ఇంటె లిజెన్స్‌ ప్రభావాన్ని ముందు గానే పసిగట్టిన ఐ పాలసీ ల్యాబ్స్‌ అనే థింక్‌ట్యాంక్‌ను నాగరాజు నెలకొల్పారు. అంతర్జాతీయ వక్తగా, రచయితగా మంచి పేరు సంపాదించారు.

అక్కడే స్కూల్‌ గవర్నర్‌గా, వాలంటీర్‌గా, విస్తృత రాజకీయ ప్రచారకుడిగా దశాబ్దకాలంగా ఇంటింటికీ ప్రచారంతో అక్కడి ప్రజల్లో పట్టు సాధించారు. అక్కడ ఇప్పటి వరకు జరిగిన కొన్ని ఎన్నికల్లో లేబర్‌ పార్టీ ఎంపీలు వరుసగా గెలుస్తూ వస్తున్నారు.

ఈ నెల జరిగిన కౌన్సిలర్‌, రాష్ట్ర మేయర్‌ ఎన్నికలోనూ లేబర్‌ పార్టీ ఘనవిజయం సాధించింది. దీనితో తెలుగు ముద్దు బిడ్డ ఉదరు నాగ రాజు కూడా బ్రిటన్‌ పార్ల మెంట్‌ ఎన్నికల్లో ఎంపీగా ఘన విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుందని లండన్‌ ప్రతినిధి వీఎంరెడ్డి తెలుగుమీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు…