అరుణాచలం గుడిలో తెలుగు మహిళా భక్తులపై దాడి

అరుణాచలం గుడిలో తెలుగు మహిళా భక్తులపై దాడి..

తమిళనాడు :

భక్తురాలిపై చేయి చేసుకున్న వైనం..అన్నామలై గుడి ఈవోకి పిర్యాదు చేసిన భక్తురాలు.., తమిళ భక్తులపై సైతం దాడి..

గొడవను చిత్రీకరిస్తున్నందుకు ఫోన్ లాక్కుని బెదిరింపులకు దిగిన సిబ్బంది. ఈవో చర్యలు తీసుకోకుంటే మానవ హక్కుల కమషన్ కు పిర్యాదు చేయనున్న భక్తురాలు.. అడుగడుగునా డబ్బుల భద్రతా లోపం., డబ్బు పెడితే దొడ్డిదారిన దర్శనాలు..ఇదీ ప్రస్తుత అరుణాచలం గుడిలో ఆలయ సిబ్బంది లీలలు..

వందల కిలోమీటర్లు వేలాది రూపాయలు ఖర్చు చేసుకుని తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలై గుడికి అరుణాచల శివ దర్శనం కోసం వెళ్తే తెలుగు వాళ్ళం అయినందుకు దరిద్రమైన అవమానం. గిరిప్రదక్షిణ చేసి చిన్న పిల్లలతో గుడిలోకి వెళ్తే.. మధ్యలో 50 రూపాయలు అని చెప్పి ఇంకో లైన్లోకి తోసారు.. పిల్లలు ఉన్నారు.. ఏడుస్తున్నారు సరే అని
చిన్న పాపను ఎత్తుకుని దర్శనం కోసం గంటల తరబడి నిలబడి దర్శనం చేసుకునే సమయంలో ఓ పురుష ఉద్యోగి కనీస మర్యాద కూడా లేకుండా చేయి చేసుకుని వెనక్కి నెట్టివేశాడు. అదేంటి అని అడిగితే తిరగబడి ఫోన్ లాక్కుని దుర్భాషలాడాడు. ఈ గొడవ జరుగుతున్న సమయంలో దర్శనం చేసుకుంటున్న ఒక తమిళ కుటుంబం కోసం నిలబడి ఆగి ఫిర్యాదు చేయడానికి మాకు తోడుగా వచ్చి ట్రాన్స్లేట్ చేసి హెల్ప్ చేసారు., పరిస్థితి ఇలానే కొనసాగితే తిరువన్నామలై తీరు ప్రదనార్ధకం అవ్వనుంది. ఎంతోమంది భక్తులు వ్యయప్రయాసలు కూర్చి గుడికి వెళ్తే అక్కడి సిబ్బందితీరు భక్తులపట్ల ప్రవర్తిస్తున్న తీరు చాలా దారుణంగా ఉంది.

తెలుగు రాష్ట్రాల భక్తులు గమనించాలి