గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్… టీఎస్పీఎస్సీ నుంచి గుడ్ న్యూస్..,
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-4 అభ్యర్థులకు తీపికబురు చెప్పింది. త్వరలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందని టీఎస్పీఎస్సీ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది.
అభ్యర్థులందరూ వెరిఫికేషన్‌కు కావల్సిన సర్టిఫికేట్లను సిద్ధం చేసుకోవాలని పేర్కొంది.
ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ త్వరలో అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు పిలుస్తామని ప్రెస్ నోట్లో తెలిపింది. 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను పిలుస్తామని పేర్కొంది. ఇక దివ్యాంగుల కోటాలో 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను ఆహ్వానిస్తామని స్పష్టం చేసింది.
డాక్యుమెంట్ వెరిఫికేషన్లకు కావల్సిన సర్టిఫికేట్లను సిద్ధం చేసుకోవాలని టీఎస్పీఎస్సీ తెలిపింది. EWS సర్టిఫికేట్(2021-22), కమ్యూనిటీ, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్, PWD, స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ మొదలైనవి రెడీగా ఉంచుకోవాలని పేర్కొంది.
కాగా గతేడాది జులై 1న టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 పరీక్ష నిర్వహించగా ఈ ఏడాది ఫిబ్రవరి 9న జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేసింది. తాజాగా ఈ ప్రెస్ నోట్ విడుదల చేయడంతో అభ్యర్థలు కోటి ఆశలతో వేచి చేస్తున్నారు.
మరోవైపు జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్) నిర్వహించే పీజీఈసెట్ 2024 పరీక్షా తేదీలను వాయిదా వేసినట్టు పీజీఈసెట్ 2024 కన్వీనర్ డా. ఏ.అరుణ కుమార్ శుక్రవారం ప్రకటించారు. ఈ పరీక్షలను జూన్ 10 నుండి 13 వరకు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఇదివరకు జూన్ 6 నుంచి 9 వరకు పరీక్షలు నిర్వహించాలని భావించినా.. చాలా మంది అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్, టీఎస్పీఎస్పీ గ్రూప్-1 పరీక్షలకు హాజరవుతున్నందున పరీక్ష తేదీలను మార్చినట్టు తెలిపారు.