ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లి,ని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి

ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లి,ని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి

ఖమ్మం జిల్లా :

ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం గోపాలపేటలో దారుణం చోటు చేసుకు న్నది. గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లు ఆస్తి కోసం తన తల్లితో పాటు ఇద్దరు కుమార్తెలను హత్య చేశాడు.

తన పేరుపై ఆస్తి రాసివ్వడం లేదని కోపం పెంచుకున్న వెంకటేశ్వర్లు.. తల్లి పిచ్చమ్మ(60)ను గొంతు నులిమి చంపాడు. అనంతరం ఇద్దరు కుమార్తెలు నీరజ(10), ఝాన్సీ(6)లను చంపి పరారయ్యాడు.

పొలం తన పేరుపై రాయా లంటూ తల్లిని వెంకటేశ్వర్లు కొన్నేండ్లుగా వేధిస్తున్నట్లు తెలుస్తున్నది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కాగా, వెంకటేశ్వర్లు ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, రెండేండ్ల క్రితం భార్యను కూడా హత్య చేశాడని స్థానికులు తెలిపారు…