కన్నపు నేరములకు పాల్పడుతున్న దొంగల ముఠా అరెస్టు

రామగుండం పోలీస్ కమీషనరేట్

కన్నపు నేరములకు పాల్పడుతున్న దొంగల ముఠా అరెస్టు

బంగారం ఆభరణాలు,వెండి ఆభరణాలు, బైక్ LED TV, హోమ్ థియేటర్, గిటార్ వీటి మొత్తం విలువ…11,72,000 స్వాధీనం

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్ కు సంబందించి వివరాలు మంచిర్యాల పట్టణ కేంద్రం లోని “M” కన్వెషన్ హల్ లో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్, ఐపిఎస్., గారు వివరాలు వెల్లడించారు.

నిందితుల వివరములు;

A-1) పాగిడి కార్తీక్ S/o విలాస్, వయస్సు: 19సం,,లు కులం: నేతకాని, నివాసం: CCC, ప్రశాంత్ నగర్, నస్పూర్ మండలం

A-2)తాటికొండ స్వామి చరణ్ @మున్నా S/o రమేష్, వయస్సు: 19 సం,,లు, కులం: మాదిగ, నివాసం: గాంధీ నగర్, మంచిర్యాల

A-3)పుప్పాల రాహుల్ S/o సత్యనారాయణ, వయస్సు: 19 సం,,లు, కులం: మున్నూరు కాపు, నివాసం: లక్ష్మిపురం గ్రామం, బెల్లంపల్లి మండలం

A-4)గన్నారం మధుకర్ S/o రమేష్, వయస్సు: 20 సం,,లు, కులం: చాకలి, నివాసం: సుందరయ్య కాలనీ, నస్పూర్ మండలం

5)కుర్సింగ ఈశ్వర్, త: భీమ్రావు, వ: 20 సం. లు, కు: పార్ధన్, వృ: విద్యార్థి, ని: 1-178, రేగులగూడెం, కోమటిచేను, కాసిపేటమండలం, ప్రస్తుతనివాసం: తిర్యానిమండలం, KBM ఆసిఫాబాద్ జిల్లా

6)మడావి రాముS/o మడావి పైకు, వయస్సు: 22 సంవత్సరాలు, కులం: ST పర్దాన్, Occ: ఆటోడ్రైవర్R/o: 1-5తిర్యాణి, KBM ఆసిఫాబాద్ జిల్లా

7) వెద్మ ప్రవీణ్ S/o భగవంతరావు, వయస్సు:22 yrs వయస్సు: సంవత్సరాలు, కులం: St Pardhan, Occ: కూలీ, R/o; h నెం1-62, తిర్యానిమండలం కన్నెపల్లి గ్రామం, కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా

నిందితుల వద్ద నుండి స్వాధీన పరుచుకున్న వాటి వివరాలు

బంగారం ఆభరణాలు 9,22,000
వెండి ఆభరణాలు 60,000
బైక్ 50,000
LED TV, హోమ్ థియేటర్ , 1,20,000
గిటార్ 20,000
మొత్తం విలువ…11,72,000

మంచిర్యాల, హాజీపూర్, సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితులు మోటర్ సైకిల్ లతో పగటిపూట తాళం వేసి ఉన్న ఇళ్లను గమనిస్తూ రాత్రిపూట, ఇనుప రాడ్లతో ఇంటి తాళలను పగుల గొట్టి దొంగతనాలు చేస్తూ తాను చేసిన దొంగ సొత్తును మధుకర్ అనే నేరస్తుని ద్వారా అమ్మి వచ్చిన మొత్తం డబ్బులను పంచుకొని వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారు. ఇలా దొంగతనం చేసిన దొంగసొత్తును కరీంనగర్ వెళ్ళి అమ్ముటకు అందరూ కలిసి గాంధీనగర్ లోని తాటికొండ స్వామిశరణ్ @ మున్నా ఇంటివద్ద వున్నారన్న నమ్మదగిన సమాచారం తో వెళ్ళి నిదితులను పట్టుకొని విచారించగ వారు చేసిన దొంగతములను ఒప్పుకున్నారు.

రామకృష్ణ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన నిందితులు

రామకృష్ణపూర్,బెల్లంపల్లి మందమర్రి  పోలీసు స్టేషన్ పరిది లోని ,దొంగతనాలు చేసిన అభరణాలని మంచిర్యాలలో అమ్ముదానికి ఈరోజు మంచిర్యాలకు రఘు యొక్కఆటోలో వెళుతుండగా క్యాథనాపల్లిx రోడ్డు వద్ద పోలీసు వారి వాహన తనఖీ చూసి ఆటోని వెనక్కి తిప్పి తిరిగి పారిపోతుండగా పోలీసువారికి అనుమానం వచ్చి వారిని వెంబడించి కుర్మాపల్లిx రోడ్డు వద్ద పట్టుకొని విచారించగ వారి చేసిన దొంగతనములను ఒప్పుకోవడంజరిగింది

వివరాల్లోకి వెళితే….

జల్సా లకు అలవాటుపడ్డ నేరస్తులు సులువుగా డబ్బులు సంపదించుకోవటానికి నేరస్తులు పగలు సమయన మోటర్ సైకిల్ పై తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇండ్లను గమనించి రాత్రి పూట వారి వెంట తీసుకు వెళ్ళినా ఇనుప రాడ్ తో ఇంటి తాళాలను పగుల గొట్టి రాత్రిపూట దొంగతనం చేసేవారు.

📌 ఇలా 2024 ఫిబ్రవరి నెల మొదటి వారంలో రాత్రి సమయంలో మంచిర్యాలలోని జాఫర్ నగర్ నందు ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించి వారి దగ్గర ఉన్న ఐరన్ రాడ్ తో ఇంటి తాళం పగలగొట్టి లోనికి వెళ్ళి బీరువా తెరిచి అందులో గల రెండు బంగారపు ఉంగరాలు,ఒక జత బంగారు చెవి కమ్మలు దొంగలించుకొనివెళ్ళినారు .

📌మార్చి నెల రెండవ వారంలో CCC నస్పూర్ ఒక ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించి వారి దగ్గర ఉన్న ఐరన్ రాడ్ తో ఇంటి తాళం పగలగొట్టి లోనికి వెళ్ళి సూట్ కేసు తెరిచి అందులో 50,000/- నగదు ఒక బంగారి చైన్, ఒక జత చెవి కమ్మల బుట్టాలు దొంగలించుకొనివెళ్ళినారు

📌2024 ఏప్రిల్ నెల లో మాక్స్ షాపింగ్ మాల్ దగ్గర గల సాయి హనుమాన్ నగర్ దగ్గర ఒక ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించి వారి దగ్గర ఉన్న ఐరన్ రాడ్ తో ఇంటి తాళం పగలగొట్టి లోనికి వెళ్ళి బీరువా తాళం పగలగొట్టి అందులో ఉన్న ఒక బంగారు చైన్,రెండు చిన్న బంగారు గాజులు, 5 బంగారపు ఉంగరాలు మరియు 3 వెండి గిన్నెలు, 2 వెండి చిన్న చేతి కడియాలు(గాజులు), ఒక వెండి కాలి కడియం, రెండు జతల వెండి కాలి పట్టీలు దొంగలించుకొనివెళ్ళినారు .

📌2024 ఏప్రిల్ నెల రెండవ వారంలో హాజీపూర్ మండలం లోని గుడిపేట్ లో ఒక ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించి వారి దగ్గర ఉన్న ఐరన్ రాడ్ తో ఇంటి తాళం పగలగొట్టి లోనికి వెళ్ళి బీరువా తాళం పగలగొట్టి అందులో ఉన్న 10 జతల వెండి కాలి పట్టీలు, వెండి కడియంలను, ఒక బంగారు చైన్, చిన్న బంగారపు ఉంగరం మరియు 20,000/- దొంగలించుకొనివెళ్ళినారు .

ఇదే రోజున దొంగతనం చేసి తిరిగివస్తు మార్గమద్యలో గల వేంపల్లి లోని SBR కాలనీ లో ఒక ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించి వారి దగ్గర ఉన్న ఐరన్ రాడ్ తో ఇంటి తాళం పగలగొట్టి లోనికి వెళ్ళి ఒక LED TV మరియు Home theater ని దొంగలించుకొనివెళ్ళినారు .

📌ఇదే నెలలో మారుతి నగర్ లోని ఒక ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించి వారి వెంట ఉన్నబ్యాగ్ లో గల ఐరన్ రాడ్ తో ఇంటి తాళం పగలగొట్టి లోనికి వెళ్ళి ఇంట్లో ఉన్న cupboard లో పెట్టిన బీరువా key దొరకటం తో . అట్టి key తో బీరువా తాళం తెరిచి అందులో ఉన్న ఒక్కొక్కటి సుమారు తులం నర గల రెండు బంగారి నెక్లెస్ లు మరియు సుమారు 3 తులాలు గల రెండు బంగారి గొలుసులు , ఒక laptop మరియు Realme cellphone ని దొంగలించినారు.

నిందితులు రామకృష్ణాపూర్, బెల్లంపల్లి వన్ టౌన్, టూ టౌన్, మందమర్రి మరియు చేసిన నేరములు :

నిందితులు సాయి కుటీర్ గద్దెరాగది దగ్గర లో ఒకఇంట్లోఒకబంగారుగొలుసు, ఒకవెండిపట్టీలు, మరియునగదు, పూజకి సంబందించిన వెండి సామాన్లు దొంగిలించినారు
బెల్లంపల్లిలో స్టేషన్ రోడ్డు కాలనీలోని ఒక ఇంట్లో ఒకబంగారుఉంగురం, ఒకబంగారుచైన్, మూడుచిన్నరింగులుబంగారివి, నగధు 20,000/- దొంగిలించారు
అమ్మగార్డెన్స్ఏరియాలో 25000/- నగదు, ఒకకెమెర ను దొంగిలించారు
మందమర్రి బురదగూడెంలో దొంగాతనికి ప్రయత్నంచేయడంజరిగింది
బెల్లంపలిలోని బూడిదగడ్డబస్తిలో నితాళంవేసిఉన్నఇంట్లో ఒకజతవెండికడియాలు, ఒకజతచెవికమ్మలు, ఒకబంగారుఉంగురం, ఒక ఫోన్ ను దొంగలించినారు
RR నగర్ లో రెండుఇళ్ళలోఒకబంగారు ఉంగురం, బంగారుచెవికమ్మలు, దొంగలించినారు
బెల్లంపల్లిCaltex ఏరియాలోఒకహోండాshine మోటర్ సైకల్ ను దొంగలించినారు .