తల్లి పాలతో వ్యాపారం… వేలల్లో ఆదాయం దర్యాప్తులో కీలక విషయాలు లభ్యం

తల్లి పాలతో వ్యాపారం… వేలల్లో ఆదాయం దర్యాప్తులో కీలక విషయాలు లభ్యం…

చెన్నై మహానగరంలో తల్లిపాలతో వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. 200మిల్లీ లీటర్ల తల్లిపాలు వెయ్యిరూపాయలు వరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ అక్రమ దందాపై కొందరు స్థానికులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆ ఫిర్యాదులపై అధికారులు అప్రమత్తమయ్యారు. చట్టవిరుద్ధంగా తల్లిపాలను విక్రయిస్తున్న షాపులపై దాడులు నిర్వహించారు.

తల్లిపాలతో వ్యాపారం.. వేలల్లో ఆదాయం.. దర్యాప్తులో కీలక విషయాలు..చెన్నై మహానగరంలో తల్లిపాలతో వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. 200మిల్లీ లీటర్ల తల్లిపాలు వెయ్యిరూపాయలు వరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

ఈ అక్రమ దందాపై కొందరు స్థానికులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆ ఫిర్యాదులపై అధికారులు అప్రమత్తమయ్యారు. చట్టవిరుద్ధంగా తల్లిపాలను విక్రయిస్తున్న షాపులపై దాడులు నిర్వహించారు. చెన్నైలోని ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ అధికారులు మాధవరంలోని తల్లి పాలను రూ.500 చొప్పున విక్రయిస్తున్న దుకాణంపై దాడి చేశారు.

ముత్తయ్య అనే వ్యక్తికి చెందిన వ్యాక్సిన్‌ స్టోర్‌ను సీల్‌ చేశారు. 50 బాటిళ్ల తల్లి పాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనపరుచుకున్న చేసిన తల్లి పాలను పరీక్ష కోసం చెన్నై గిండీలోని కింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ & రీసెర్చ్‌కు పంపారు.

ముత్తయ్య తల్లి పాలను ఎలా పొందాడు, ఎన్నాళ్ల నుంచి ఈ వ్యాపారం కొనసాగిస్తున్నాడు అనే దానిపై దర్యాప్తు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా తల్లిపాల విక్రయాలను నిషేధిస్తున్నట్లు జిల్లా ఆహార భద్రత అధికారి మరోసారి స్పష్టం చేశారు ముత్తయ్య ప్రొటీన్‌ పౌడర్‌ విక్రయానికి లైసెన్స్‌ తీసుకుని ఆ ముసుగులో తల్లి పాలను బాటిళ్లలో పెట్టి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

బాటిల్స్‌లోని తల్లి పాలు ఎవరి వద్ద నుండి పొందారనేదానిపై కూపీలాగుతున్నారు. ఈ దాడిలో తల్లి పాలను దానం చేసే మహిళల పేర్లు, వారి ఫోన్ నంబర్లతో కూడిన నోట్‌బుక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఆ నంబర్లకు కాల్ చేసి మత్తయ్య చెప్పిన వివరాలు సరైనవేనా అని దర్యాప్తు చేపట్టారు.

తల్లి పాలను నిల్వ చేయడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలను కూడా అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. ఇలా దీర్ఘకాలం నిల్వ చేయడంవల్ల సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా పెరిగి లేని పోని అనారోగ్యాలకు కారణం అవుతుందని చెప్పారు. అలాగే తల్లి పాలలో ఉండే సహజ ప్రొటీన్లు నశిస్తాయని వివరించారు. అందుకే తల్లి పాలను సీసాలలో అమ్మడం నిషేధించడమైనదని పేర్కొన్నారు.