నేడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

నేడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

ఫిల్మ్‌సిటీలో 9 గంటలకు ప్రారంభం

హైదరాబాద్‌ :

రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం ఉదయం ప్రభుత్వ అధికార లాంఛనాలతో రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించనున్నారు.

ఉదయం 9 గంటల నుంచి అంతిమ సంస్కారాలు ప్రారంభం కానున్నాయి. శనివారం రామోజీ ఫిల్మ్‌సిటీలోని కార్పొరేట్‌ భవన సముదాయంలో ఆయన పార్థివదేహాన్ని ఉంచగా.. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సందర్శించి ఘన నివాళి అర్పించారు. వారిలో ఏపీ గవర్నర్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు ఉన్నారు.

ఇంకా మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి నివాళి అర్పించారు. సినీ ప్రముఖులు చిరంజీవి, ఇళయరాజా, ఎంఎం కీరవాణి, రాజమౌళి, మోహన్‌బాబు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌, త్రివిక్రమ్‌, నరేశ్‌, మోహన్‌బాబు, విష్ణు, రాజేంద్రప్రసాద్‌, దగ్గుబాటి సురేశ్‌బాబు, నందమూరి కల్యాణ్‌రామ్‌, విజయేంద్రప్రసాద్‌, బోయపాటి శ్రీను, మురళీమోహన్‌, బ్రహ్మానందం శ్రద్ధాంజలి ఘటించారు. ఏపీ నేతలు పరిటాల సునీత, పితాని సత్యనారాయణ, అచ్చెన్నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, సుజనా చౌదరి, యలమంచిలి శివాజీ, వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌, తెలంగాణ నాయకులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, పువ్వాడ నాగేశ్వరరావు, వివిధ పత్రికల ఎడిటర్లు, పలు చానెళ్ల అవుట్‌పుట్‌ ఎడిటర్స్‌, నమస్తే తెలంగాణ ఎడిటర్‌ తిగుళ్ల కృష్ణమూర్తి నివాళి అర్పించారు. ఈనాడు సంస్థలు, రామోజీ గ్రూపుల్లో పనిచేస్తున్న సిబ్బంది, కుటుంబసభ్యులు, రామోజీరావు ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా సాయం పొందిన ఎంతోమంది ఆయనను కడసారి చూసేందుకు క్యూ కట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కిషన్‌రెడ్డి, ఎంపీలు బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌, పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రామోజీ సేవలను స్మరించుకున్నారు.