అయోధ్య లో దళితుడి విజయం…
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రములోని ఫైజాబాద్ పార్లమెంటు సభ్యునిగా సమాజ్ వాదీ పార్టీ కి చెందిన దళిత లీడర్ అవదేశ్ ప్రసాద్ జనరల్ స్థానంలో పోటీ చేసారు.
అతని సమీప ప్రత్యర్థులు బీఎస్పీ నుండి పోటీ చేసిన సచిదానంద్ పాండే అనే బ్రాహ్మణుడిని.. లల్లూసింగ్ అనే బీజేపీకి చెందిన (ఆల్రెడీ సిట్టింగ్ బీజేపీ ఎంపీ ఈయన) మరో ఆధిపత్య కులపు అభ్యర్థిని ఓడించారు. అత్యద్భుతంగా.. అత్యధిక మెజారిటీతో 54 వేల పైచిలుకు ఓట్లతో గెలిచి విజయడంకా మోగించాడు.
బీఎస్పీ ఇండియా కూటమితో జట్టు కట్టి ఉంటే ఐదు రాష్ట్రాల్లో (ఉత్తరప్రదేశ్,రాజస్తాన్,మద్యప్రదేశ్,బీహార్,ఉత్తరఖండ్) బీజేపీ కి మొత్తం 50 సీట్లకు పైగా తగ్గేవి. కాంగ్రెస్ సెంటర్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసేది. బీఎస్పీ కావాలని చేసిన ఒంటరి పోరాటం వలన కనీసం ఒక్క సీటు కూడా బీఎస్పీ సాధించలేదు. నిజంగా చాలా బాధాకరం. చాలా చోట్ల బీజేపీ తక్కువ మెజారిటీతో గెలిచింది. అక్కడ ఓట్లు ఎస్పీకి బీఎస్పీ కి చీలిపోయి బీజేపీ గెలిచింది.
బీజేపీ విషకౌగిలిలో చేరి మాయావతి చేస్తున్న రాజకీయాలు వలన బీఎస్పీ అంతమై పోతుంది. బీఎస్పీ అంత మైతే మాయావతి కంటే దళిత బహుజన సమాజానికి చాలా నష్టం.
బీజేపీ తో కుమ్మక్కై బీఎస్పీ కావాలని చేసిన దుర్మార్గపు ఎత్తుగడ బెడిసికొట్టింది. మాయావతి పని బీఎస్పీ పని ఐపోయింది. కనీసం ఇకనైనా ఈ ఓటమి కి నైతిక భాద్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి మాయావతి రాజీనామా చేసి పార్టీ నుండి తప్పు కోవాలి. లేదంటే ఆ పార్టీ కోసం త్యాగాలు చేస్తూ పనిచేస్తున్న బావి తరాల నాయకులు మాయావతి గారిని పార్టీ బాద్యతల నుండి తక్షణమే బహిష్కరించాలి. బీఎస్పీ పార్టీ వ్యక్తులకన్నా నాయకుల కన్నా పీడిత వర్గాలకు చాలా అవసరం ఉంది. లేదంటే బీజేపీ రాజకీయ ఉన్మాద చర్యలకు పీడిత వర్గాలు అంతమవడం ఖాయం.