ఎస్పీ కార్యాలయం ములుగు జిల్లా :
సాధారణ ప్రజలు నడిచే కాలిబాటలో మందు పాతరలు అమర్చిన మావోయిస్టులు… నిర్వీర్యం చేసిన ములుగు జిల్లా పోలీస్.
ఆదివాసి ప్రజల ప్రాణాలకు రక్షణగా బాంబ్ స్క్వాడ్ చే ముమ్మర తనికీలు
ములుగు జిల్లాలోని తెలంగాణ – ఛత్తీస్ఘడ్ రాష్ట్ర సరిహద్దులలో వెంకటాపురం మండల
పరిధిలోని అటవీ ప్రాతంలో గత కొద్ధి రోజుల నుండి ముందస్తు చర్యలలో బాగంగా ములుగు జిల్లా పోలీస్ మరియు BD Team బృందాలు ప్రభుత్వ నిషేధిత సిపిఐ మావోయిస్టులు అమర్చినటువంటి
మందుపాతరలను గుర్తించి నిర్వీర్యం చేయడం కోసం ముమ్మర తనికీలు చేస్తుండగా ఈ రోజు అనగా తేదీ 09.06.2024 ఉదయం సమయంలో వెంకటాపురం పోలీస్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల విరభద్రవారం గ్రామ అటవీ సమీపంలో సాదారణ ప్రజలు తిరిగే కాలి బాటల వెంబడి మావోయిస్టులు అమర్చినటువంటి నాలుగు IED’s (మందు పాతరలను) గుర్తించడం అయినది అందులో మూడు IED’s (మందు పాతరలు) పేలినస్థితిలో గుర్తించడమైనది ఇవి పేలడం ద్వారా అటవీ వన్యప్రాణులైన ఒక ముళ్ళ పంది ఒక కొండెంగా మరియు ఒక పెంపుడు కుక్క చనిపోవడం జరిగినది వాటి కళేబరాలను గుర్తించడం జరిగినది అంతేగాక ఇంకో పేలని IED ని కూడా గుర్తించి దానిని సురక్షితంగా పోలీసులు నిర్వీర్యం చేయడం జరిగినది. ఈ ప్రాంత ప్రజల సంరక్షణ కోసం ములుగు జిల్లా పోలీసులు నిరంతరం ముమ్మర తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది.
మావోయిస్టులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం మందు పాతరలను అమర్చడం ద్వారా అమాయక ప్రజలు అనేక వన్యప్రాణులు మరియు పెంపుడు జంతువులు ఈ మందు పాతరలకి బలి అయినాయి కావున ఇకనైనా ఎవరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం జరగకుండా మావోయిస్టులు ఆదివాసి నివాసాలు మరియు అటవీ ప్రాంతంలో అమర్చినటువంటి మందు పాతరలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాము. అంతేగాక మావోయిస్టులకు ప్రజలు ఎవరూ కూడా సహకరించవద్దని వారికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు అందజేయాలని కోరడం జరుగుతుంది.
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ములుగు జిల్లా