ఫిట్నెస్ లేని బస్సులు రోడ్డెక్కితే కఠిన చర్యలు… జగిత్యాల జిల్లా రవణాశాఖాధికారి

ఫిట్నెస్ లేని బస్సులు రోడ్డెక్కితే కఠిన చర్యలు… జిల్లా రవణాశాఖాధికారి వంశిధర్

జగిత్యాల జిల్లాలో రవాణా శాఖ అధికారుల తనిఖీలు

జగిత్యాల :

ఫిట్నెస్ లేని స్కూల్, కాలేజి బస్సులు రోడ్డెక్కితే కఠిన చర్యలు తీసుకుంటామని జగిత్యాల జిల్లా రవాణా శాఖాధికారి వంశీధర్ హెచ్చరించారు.
ఫిట్నెస్ లేని ప్రయివేట్ స్కూల్, కాలేజి బస్సులను శుక్రవారం అధికారులు తనిఖీ చేశారు.
బస్సు ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్ , ఫైర్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్ కిట్లను అధికారులు తనిఖీ చేశారు.
ఫిట్నెస్ లేని స్కూల్, కాలేజ్ బస్సులు తనిఖీ చేసి
ఫిట్నెస్ లేని మూడు స్కూల్ బస్సులను సీజ్ చేశారు.

ఈసందర్భంగా వంశీధర్ మాట్లాడుతూ…

జగిత్యాల జిల్లాలో 470 స్కూల్ , కాలేజ్ బస్సులకు గాను 320 బస్సులు మాత్రమే ఫిట్నెస్ కలిగి ఉన్నాయని మిగతా150 బస్సులు ఫిట్నెస్ చేయించుకోవాలని యజమానులకు సూచించారు.
ఇందులో ఏమైనా బస్సులు స్క్రాప్ కు వెళ్లాయాఇంకా ఎన్ని బస్సులు ఉన్నాయో సమాచారం ఇవ్వాలని యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చామని డిటిఓ తెలిపారు.
ఫిట్నెస్ లేని స్కూల్, కాలేజ్ బస్ లు నడిపి పిల్లల జీవితాలతో ఆటలాడుకోవద్దని చెబుతూ వెంటనే ఫిట్నెస్ చేయించుకోవాలని జిల్లా రవాణా శాఖాధికారి వంశిధర్ అన్నారు.