EVMలను నిషేధించాల్సిందే బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించాలి… CPI నారాయణ

EVM లను రద్దు చేసి బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలను నిర్వహించాలని CPI నారాయణ డిమాండ్ చేశారు. ప్రపంచంలో 122 దేశాల్లో ఈవీఎంలను వినియోగించడం లేదు..

ఆ దేశాల్లో బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈవీఎంలను బ్యాన్ చేశారని గుర్తు చేశారు.

అమెరికా, జపాన్ లాంటి దేశాలు బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. మన దేశంలోనే ఈవీఎంలతో ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలి. వచ్చే ఎన్నికలను ఈవీఎంల ద్వారా నిర్వహించొద్దు. ఇది ప్రజల డిమాండ్. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా చర్చలు జరపాలి. ఈవీఎంలను బ్యాన్ చేయాలి. ఈవీఎంలను నిషేధించకపోతే.. తప్పును ప్రోత్సహించినట్లు అవుతుందని నారాయణ పేర్కొన్నారు.