జగిత్యాల జిల్లా…
జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అశోక్ కుమార్ ఐపీఎస్ గారు
2019 ఐపిఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి
జిల్లా పరిధిలోని ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రజల భద్రత, రక్షణే ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు తెలియజేసారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లా ఎస్పీగా గానియమించబడిన అశోక్ కుమార్ ఐపీఎస్ గారు ఈరోజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ గారి నుండి బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులు ఎస్పీగారి ని మర్యాదపూర్వకంగా కలుసుకోని పుష్పాగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు.
అనంతరం ఎస్పీ గారు మాట్లాడుతూ….. జిల్లా పరిధిలోని సామ్యాసుడిని దృష్టిలో పెట్టికోని వారికి భరోసా కలిగించే విధంగా పోలీసింగ్ వుంటుందని, శాంతి భద్రతల విషయంలోను కఠినంగా వుంటామని, ఎవరైన శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తప్పావని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా, విద్వేషాలను రెచ్చగోట్టేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలియజేసారు.