జగిత్యాల జిల్లాలో పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల దాడి

జగిత్యాల జిల్లా….

పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల దాడి  7గురు అరెస్ట్

4,50,000/- నగదు,7మొబైల్స్ మరియు ఒక కారు, బైక్ స్వాధీనం …

జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాలతో అక్రమ కార్యక్రమాలపై పటిష్ఠ నిఘా …

పేకాట ఆడిన, నిర్వహణ స్థావరాలు ఏర్పాటు చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు

మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని భీమారం గ్రామ శివారులో గల మామిడితోట లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట స్థావరం పై సీసీఎస్ పోలీసులు దాడి చేసి 7 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 4,50,000/- నగదు,7 మొబైల్స్ మరియు ఒక బైక్, కార్ స్వాధీనం చేసుకోవడం జరిగింది ….

ఈ సందర్భంగా సిసిఎస్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ… జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాలతో అక్రమ,అసాంఘిక కార్యక్రమాలపై నిఘా పటిష్టం చేసి,పక్క సమాచారంతో దాడులు నిర్వహిస్తున్నట్ల తెలిపారు …

ఇట్టి దాడుల్లో సీసీఎస్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ,ఎస్సై శ్యామ్ రాజ్,మరియు సిబ్బంది పాల్గొన్నారు …