వరుణ దేవుని కోసం రైతు ఎదురుచూపు…!! మొఖం చాటేసిన వర్షాలు…!!

వరుణ దేవుని కోసం రైతు ఎదురుచూపు…!! మొఖం చాటేసిన వర్షాలు…!!

తెలంగాణ రాష్ట్రంలో అనుకున్న సమయాన్ని కంటే ముందు నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించినప్పటికీ వర్షాలు రైతుల కు ఆశ చూపించి మురిపించి మొఖం చాట్ చేయడంతో రైతులు ప్రతిరోజు వరణ దేవుని కోసం ఎదురుచూస్తున్నారు.

ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయినప్పటికీ సకాలంలో వర్షాలు వచ్చినప్పటికీ మళ్లీ వర్షం జాడ కనిపించకపోవడంతో దుక్కి దున్ని విత్తనాలు వేసే సమయంలో రైతులకు నిరాశ కలిగింది.

ఈసారి వర్షాలు పుష్కలంగా ఉన్నప్పటికీ మొదట ఆర్భాటంగా ఎగువన కురిసిన వర్షాల వల్ల జూరాల తుంగభద్ర , కృష్ణమ్మ లో నేటి ప్రవాహం పెరిగినప్పటికీ మళ్లీ నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది , వాతావరణ శాఖ లెక్కల ప్రకారం ఈ సంవత్సరం వర్షాలు ఆశించిన మేర ఉంటాయని ప్రకటించినప్పటికీ సకాలంలో వర్షం రాకపోవడం వల్ల రైతులు తీవ్ర నష్టపోయే ప్రమాదం నెలకొన్నది.

ఒకపక్క ప్రభుత్వం రైతులకు సకాలంలో ఎరువులు పంట రుణాల కోసం బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించకపోవడం రైతు భరోస నిధులు కూడా సకాలంలో ఇవ్వకుండా క్యాబినెట్ సబ్ కమిటీ పేరుతోన కాలయాపన చేస్తుందని విమర్శలు వస్తున్నాయి.

ఒక పక్క కౌలు రైతులు పెట్టుబడుల కోసం అప్పులు తెలుసుకొని తిప్పుతూ తన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు, ప్రభుత్వం కౌలు రైతులకు ఏ విధంగా రైతు భరోసనిధులు చెల్లిస్తుందో స్పష్టత తెలియజేయాలని కౌలు రైతులు కోరుతున్నాను.

పట్టా కరిగిన భూములు కలిగిన యజమానులు కౌలు రైతులకు పత్రాలు కానీ ఎలాంటి అప్పిడివేట్ రాయించి ఇవ్వడం లేదని పలువురు రైతులు అంటున్నారు, రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు నెలలో మాఫీ చేస్తే బ్యాంకులు ఎప్పుడు రైతులకు మళ్ళీ తిరిగి రుణాలు చెల్లిస్తారు అర్థం కావడంలేదని రైతులు అంటున్నారు.

వెంటనే రైతు భరోసానిధులను ఆలస్యం చేయకుండా పట్టా కలిగినప్పుడు యజమానులకు చెల్లించాలని రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ రైతులు డిమాండ్ చేస్తున్నారు, ప్రభుత్వం రైతు భరోసనిధులతో పాటు రెండు లక్షల రూపాయల పంట రుణమాఫీ పథకంలో ఎలాంటి షరతులు కొర్రీలు పెట్టకుండా సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలని రైతుల కొడుతున్నారు, వర్షాభావ పరిస్థితుల వల్ల నష్టపోయే రైతులకు ప్రభుత్వం పంట ఇన్సూరెన్స్ పథకాలు వెంటనే అమలు చేసి రైతులను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.