నీట్ పరీక్ష పత్రాల లీకులు….
పరీక్ష పత్రం 30 లక్షలు….
కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు…
ఓ 1500 విద్యార్థుల పై వేటు…
మరలా వీరికి పరీక్షలు…..
దీనికి కారణం ఎవరు….???
పాలకులా….?? పోటీ ప్రపంచంను.. ఆశరాగా తీసుకొని.. తమ విద్యా వ్యాపారం కోసం… దేశంలో ఇటువంటి అకృత్యాలకు పాల్పడుతున్న ప్రైవేటు వ్యాపార సంస్థలే….
దక్షిణాఫ్రికాలో ఒక యూనివర్సిటీ ప్రవేశ ద్వారం వద్ద ఇలా రాసిన పెద్ద బోర్డు ఉంటుంది:-
ఒక దేశాన్ని నాశనం చెయ్యాలంటే మిస్సైల్స్ కానీ ఆటమ్ బాంబులు కాని అవసరం లేదు. నాసిరకం విద్య, విద్యార్థుల్ని పరీక్షల్లో కాపీ కొట్టనివ్వడం లాంటి విధానాన్ని ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ఆ దేశం దానంతట అదే నాశనం అవుతుంది.
1. అలా చదివిన వైద్యుల చేతిలో రోగులు చనిపోతారు. ప్రజారోగ్యానికి భరోసా ఉండదు…
2. అలా చదివిన ఇంజనీర్ల చేతిలో కట్టడాలు కూలిపోతాయి.
3.అలా చదివిన ఆర్థికవేత్తల చేతిలో నా దేశ ఆర్థిక వ్యవస్థ పతనమవుతుంది.
4. అలా చదివిన సంఘ సంస్కర్తల చేతిలో మానవత్వం మంటగలుస్తుంది.
5. అలా చదివిన న్యాయమూర్తుల చేతిలో న్యాయం అన్యాయంగా మారిపోతుంది.
6 ఇలా చదివిన వారు స్వార్థంతో దేశం, సమాజం గురించి ఆలోచన మరిచి… దేశ ద్రోహులుగా,సమాజ ద్రోహులుగా, అవినీతి పరులు గా మారుతున్నారు… మానవత్వం మరిచి (కరోనా మహమ్మారి లో కొద్దిమంది రాక్షసత్వాన్ని చూసాం)
7.వీరే పాలకులు కాబట్టే…. దేశ ప్రజల ఈ అవస్థలు…
ఓటుకు నోటు… కులం మతం ప్రాంతం ఇది దుస్థితి కారణం వీరె..
ఏ దేశంలో విద్య నాశనం అవుతుందో… ఆదేశం పతనావస్థకు చేరుకుంటుంది….
విద్య విజ్ఞానం కోసమే కానీ…వ్యాపారం కోసం కాదు”…
మీ అభిప్రాయం ఏమిటి …???
ఇదే నా మొదలు….? ఎందుకు జరుగుతుందని….?