MLC జీవన్ రెడ్డి తన పదవికి రాజీనామా… ??
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్న జీవన్ రెడ్డి ??
మధ్యాహ్నం అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ సెక్రటరీకి తన రాజీనామా లేఖ ఇవ్వనున్న జీవన్ రెడ్డి !!!
జగిత్యాల రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరడాన్ని జిల్లా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. ససేమిరా ఒప్పుకోవడం లేదు.. పార్టీలో తానో.. అతనో.. అనే విధంగా వ్యవహారం వేడెక్కింది.
ఈ నేపథ్యంలో నిన్న మంత్రి శ్రీధర్ బాబు బుజ్జగింపు లకు ప్రయత్నించారు. అయినా కూడా జీవన్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. తాజాగా జీవన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది..
తనకు సమాచారం అందించకుండా.. పార్టీలో చేర్చుకోవడాన్ని జీవన్ రెడ్డి తీవ్రంగా తప్పుబడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీతో చర్చలు జరిపేందుకు ఆయన హైదరాబాద్ బయల్దేరారు.,
గాంధీభవన్ లో నిరసన తెలియజేయడానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీగా తరలి వెళ్ళారు.
పార్టీ కోసం ఇంతకాలం కష్టపడి పనిచేశానని.. కార్యకర్తల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత తనపై ఉందని జీవన్ రెడ్డి అన్నారు. ఈనేపథ్యపం లోనే.. జీవన్ రెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది..
గాంధీభవన్‌లో ఇంచార్జ్ దీపాదాస్ మున్షీతో చర్చలు అనంతరం తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది…