తమిళనాడు అసెంబ్లీలో నీటి పరీక్ష రద్దు పై ఏకగ్రీవ తీర్మానం

నీట్ పరీక్షకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. నీట్ రద్దు చేయాలని డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం స్టాలిన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు

నీట్ స్థానంలో గతంలోమాదిరిగానే పన్నెండో తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు చేపట్టేందుకు అనుమతివ్వాలని కేంద్రాన్ని కోరారు. మణితనేయ మక్కల్ కట్చి, ఎండీఎంకే, తమిళగ వెట్రి కజగం, సీపీఎం సహా పలు ప్రాంతీయ పార్టీలు ఈ తీర్మానానికి మద్దతు పలికాయి. నీట్ పేపర్ లీకేజీ, నీట్ పీజీ పరీక్షను వాయిదా వేశారనే అంశాలను సీఎం స్టాలిన్ అసెంబ్లీలో ప్రస్తావించారు.

నీట్ అంశంపై డీఎంకే ఎంపీ ఎమన్నారంటే?

అంతకుముందు, నీట్ నుంచి తమిళనాడుకు”మినహాయింపు” ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు డీఎంకే ఎంపీ కనిమొళి అన్నారు. ఢిల్లీలో జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నీట్‌ను రద్దు చేయాలని కోరుతున్నామని.. ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం చేశామని పేర్కొన్నారు. రాష్ట్రపతి సంతకం కోసం వేచిచూస్తున్నట్లు తెలిపారు.