జగిత్యాల జిల్లా లో దొంగతనలకు పాల్పడుతున్న 3 గురు నిందితులు, ఒకరు బంగారం కొన్న వ్యక్తి అరెస్ట్

జగిత్యాల జిల్లా…..

జిల్లా లో దొంగతనలకు పాల్పడుతున్న 3 గురు నిందితులు, ఒకరు బంగారం కొన్న వ్యక్తి అరెస్ట్.

260 గ్రాములు బంగారు ఆభరణాలు, కారు -1, వ్యవసాయ కరెంట్ మోటార్లు-3, మూడు సెల్ ఫోన్ లను స్వాదినo.

స్వాదిన పరచుకున్న మొత్తం విలువ సుమారు 30,00,000/-రూపాయలు.

జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు.

గత కొద్ది రోజుల నుంచి జగిత్యాల జిల్లా పట్టణ మరియు పరిసర ప్రాంతాలలో గల తాళం వేసిన ఇండ్లల్లో క్రింద పేర్కొన్న నిందితులు పలు దొంగతనలకు పాల్పడినారు, పోలీస్ స్టేషన్ల వారిగా మొత్తం 11 -కేసులు నమోదు అయినవి.

నిందితుల వివరాలు :

1. వనం రాము s/o నర్సింహులు 34 సం.లు, కులం: కుంచెరుకాల r/o ఇంటి. నెం.216 ,తారకరామనగర్

2. జగన్నాథ్ అభియా s/o నాగయ్య , 40సం లు , కులం: కుంచెరుకాల r/o ఇంటి. నెం.216 ,తారకరామనగర్

3. జగన్నాథ్ మీనయ్య s/o నాగయ్య , 24 సం లు , కులం: కుంచెరుకాల r/o ఇంటి. నెం. 6-6 ,తారకరామనగర్

పై నిందితులను ఈ రోజు న అనగా తేది : 29 .06 .2024 రోజున మద్యాహ్నం 14:00 గంటలకు JNTU చెక్ పోస్ట్,నాచుపల్లి
NH -563 హైవే రోడ్డు వద్ద వాహనాలు తనికి చేస్తుండగా పట్టుబడినారు. దొంగలించిన బంగారంలో కొంత మొత్తాన్ని గంగాధర్ ,సిద్దార్థ్ జువెల్లర్ జగిత్యాల అనునతనికి అమ్మడం జరిగింది , మరో ఇద్దరు నిందితులు పరారీలో వున్నారు. పైన తెలిపిన నిందితుతలు ఉదయం పూట బండ్ల మీద తాళం వేసిన ఇళ్లను గమనించి రాత్రి సమయంలో ఊరి చివర్లో వాహనాన్ని నిలిపి దొంగతనం చేసి వాహనాలపై పారిపోవడం జరుగుతుంది. ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ గారు ప్రజలకు సూచించారు. గ్రామలో ,పట్టణలో అనుమానాస్పదంగా తమ వీధుల్లో తిరిగే కొత్త వ్యక్తుల కదలికలపై 100 డయల్ లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు.

నిందితుల నుంచి స్వాదినపరుచుకున్న సొత్తు వివరాలు:

1. బంగారు ఆభరణాలు – 260 గ్రాములు

2. హుందాయి I 20 కారు -1

3.వ్యవసాయ కరెంట్ మోటార్లు-3

4.మూడు సెల్ ఫోన్ లను స్వాదిన పరుచుకోవడం జరిగింది.

“ స్వాదిన పరచుకున్న మొత్తం విలువ సుమారు 30,00,000/-రూపాయలు”.

దొంగతనాల వివరాలు
జగిత్యాల జిల్లా: ( 11-కేసులు)

1.కోడిమ్యాల పి. యస్:కోడిమ్యాల గ్రామంలోని నాగుల ఆఖిల అను ఇంటిలో తాళం పగులగొట్టి దొంగతనం,
2. మల్యాల పి. యస్: మల్యాల మండలం లోని తాటిపల్లి గ్రామం నందు దాసరి లక్ష్మీనారాయణ ఇంట్లో దొంగతనం .
3. మల్యాల పి. యస్: మల్యాల మండలం లోని తాటిపల్లి గ్రామం నందు సిరిమల్ల రాజ్యలక్ష్మీ ఇంట్లో దొంగతనం
4. మల్యాల పి. యస్: మల్యాల మండలం లోని మానాల గ్రామం నందు ఎడపెల్లి స్వప్న ఇంట్లో దొంగతనం
5. మల్యాల పి. యస్: మల్యాల మండలం లోని పోతారం గ్రామం నందు ఎలుకొండ చిన్న గంగారం ఇంట్లో దొంగతనం
6. మేడిపల్లి పి. యస్: మేడిపల్లి మండలం లోని కట్లకుంట గ్రామం నందు కుంట హారిక ఇంట్లో దొంగతనం
7. మేడిపల్లి పి. యస్: మేడిపల్లి మండలం లోని దేశాయిపేట గ్రామం నందు ఇల్లందుల శ్రీనివాస్ ఇంట్లో దొంగతనం
8 . రాయికల్ పి. యస్: రాయికల్ గ్రామం నందు బూడికే విజయలక్ష్మి ఇంట్లో దొంగతనం
9. జగిత్యాల రూరల్ పి. యస్:జగిత్యాల మండలం లోని ధరూర్ గ్రామ శివారులో కెనాల్ దగ్గర గల రెండు వ్యవసాయ కరెంట్ మోటార్లు దొంగతనం
10 జగిత్యాల రూరల్ పి. యస్: జగిత్యాల మండలం లోని తాటిపెళ్ళి గ్రామ శివారులో కెనాల్ దగ్గర గల ఐధు వ్యవసాయ కరెంట్ మోటార్లు దొంగతనం ,
11. జగిత్యాల రూరల్ పి. యస్: జగిత్యాల మండలం లోని ధరూర్ గ్రామ శివారులో కెనాల్ దగ్గర గల రెండు వ్యవసాయ కరెంట్ మోటార్లు దొంగతనం ,

పైన తెలిపిన ప్రాంతాలలో బంగారు, వెండి ఆభరణాలు మరియు డబ్బులు దొంగిలించిన పై ముగ్గురు దొంగలను, జిల్లా ఎస్పి శ్రీ ఆశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాలమేరకు జగిత్యాల డిఎస్పి శ్రీ రఘుచంధర్ గారి సూచనాలతో మరియు మల్యాల CI, నీలం రవి వారి పర్యవేక్షణలో పై దొంగలను పట్టుకున్న కోడిమ్యాల S.I సౌడం సందీప్, హెడ్ కానిస్టేబుల్ లు రాజు,రాజయ్య, సౌందర్య మరియు కానిస్టేబుల్ లు తిరుమల్, చంద్రశేఖర్ , వినోద్ ,రాజు ,సాగర్ ,శ్రీకాంత్ ,రాకేశ్ ,కళ్యాణ్, స్వప్న,కళ్యాణి మరియు CDR సెల్ నేరెళ్ళ రాజశేఖర్ , మహేష్ ,మల్లేశం మరియు ఇతర సిబ్బందిని జగిత్యాల ఎస్పిగారు అభినందిచినారు.

ఈ యొక్క విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ (AR) భీమ్ రావు ,డిఎస్పీ రఘు చందర్, మల్యాల సి.ఐ రవి, ఎస్.ఐ సందీప్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.