వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల తరుపున ప్రభుత్వాన్ని నిలదీస్తాం.

గ్రూప్స్, నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతిలాల్ నాయక్ ను పరామర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల తరుపున ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అసెంబ్లీని స్తంభింప చేస్తాం.

ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి మోతిలాల్ నాయక్ తో మాట్లాడాలి, వారి సమస్యలు పరిష్కరించాలి.

ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులతో చర్చ జరపాలి. ఇచ్చిన హామీలు అమలు చేయాలి.

ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాకా నిరుద్యోగులు తరఫున బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. ఎంతవరకైనా తెగించి కొట్లాడుతుంది.

నిరుద్యోగ యువతీ యువకులకు బీఆర్ఎస్ పూర్తి అండగా ఉంటుంది.

మోతిలాల్ నాయక్ దీక్ష విరమించాలని మీడియా సాక్షిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కలిసి ప్రభుత్వంపై పోరాటం చేద్దామని పిలుపునిస్తున్నాను.

మోతీలాల్ కు ఏం జరగక ముందే ప్రభుత్వం తక్షణంగా స్పందించాలి. అతని ఆరోగ్యం పట్ల ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత.

కోదండరాం గారు పిల్లల హక్కుల పట్ల పూర్తి బాధ్యత తీసుకోవాలి. అమలు చేసే విధంగా ముందుకు రావాలి.

మోతీలాల్ నాయక్ ఏడు రోజుల నుండి ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేకపోవడం దురదృష్టకరం.

మోతిలాల్ దీక్ష విరమించాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన అందరం కలిసి కోరాం.

ఇది నా ఒక్కడి పోరాటం కాదు తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్న అన్నడు. ప్రభుత్వం దిగివచ్చేదాకా దీక్ష విరమించెను అని చెప్పిండు.

పదేపదే కన్విన్స్ చేసే ప్రయత్నం చేసాం, అందరం కలిసి పోరాటం చేద్దాం, మేము మీ వెంట ఉన్నాం, ప్రాణం ముఖ్యం, తండ్రి లేని వాడివి అని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాం.

కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ చూపెట్టి నిరుద్యోగులను వాడుకొని వదిలిపెట్టారు. ఎన్నికలు అయిపోయాక నిరుద్యోగుల గుండెల మీద తన్నుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం.

ఓడదాటే దాకా ఓడ మలన్న ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్లు ఉంది.

ఆనాడు నిరుద్యోగుల కోసం ప్రొఫెసర్ కోదండరాం గారు, రియాజ్ గారు, బల్మూరి వెంకట్, మురళి గారు, రేవంత్ రెడ్డి గారు అశోక్ నగర్ లో కోచింగ్ సెంటర్లు చుట్టూ తిరిగారు. బస్సు యాత్రలు చేశారు.

రాహుల్ గాంధీని అశోక్ నగర్ కు తీసుకువచ్చి ప్రామిస్లు చేయించారు.

మీకు మాత్రం ఉద్యోగాలు వచ్చాయి, నిరుద్యోగులకు రాలేదు.

ఎందుకు మీ గొంతులు మూగబోయాయి?

రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ కు వచ్చి రెండు లక్షల ఉద్యోగాలు ఏడాదిలో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

ఏడు నెలలు పూర్తయింది ఎందుకు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వలేదు.

రాహుల్ గాంధీ గారికి మా నిరుద్యోగుల బాధలు కనపడడం లేదా? వినపడడం లేదా?

నిరుద్యోగులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే పోరాటాలు చేస్తుంటే ఎందుకు రాహుల్ గాంధీ గారు పట్టించుకోరు.

రేవంత్ రెడ్డికి చెప్పాలని ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ గారి ట్యాగ్ చేస్తూ నిరసన తెలియజేస్తే పట్టించుకోరు.

అశోక్ నగర్ లో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు రాహుల్ గాంధీ గారు చొరవ చూపాలి రేవంత్ రెడ్డి గారికి డైరెక్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న.

నిరుద్యోగులను రెచ్చగొట్టే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు, గ్రామాల్లోకి వెళ్లి ఓట్లు వేయాలని అడిగారు. చిటికెలో చేస్తా అన్నారు. 7 నెలలు గడిచినా చేయడం లేదు.

బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు ఏమయ్యాయి.

అసెంబ్లీలో భట్టి విక్రమార్క గారు 1:100 ఎలిజిబిలిటీ గ్రూప్ వన్ మెయిన్స్ కి ఇవ్వాలన్నారు.

ప్రొఫెసర్ కోదండరాం గారు ఇదే నిరుద్యోగులను రెచ్చగొట్టారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు.

ఉమ్మడి ఏపీలో, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో పెంచడం సాధ్యమైనప్పుడు ఇక్కడ ఎందుకు సాధ్యంకాదో రేవంత్ రెడ్డి గారు, కోదండరామిరెడ్డి గారు సమాధానం చెప్పాలి.

ప్రజా పాలనలో నిరుద్యోగులు దరఖాస్తులు ఇస్తూ చిన్నారెడ్డి గారి కాళ్ళ మీద పడితే ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు.

నిరుద్యోగులు యువకులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇదేనా ప్రజాపాలన?

విద్యార్థులు న్యాయమైన డిమాండ్ అడుగుతున్నారు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.