ప్రభుత్వ ఆసుపత్రులల్లో అభివృద్ధి కమిటీల జాడేదీ…?

ప్రభుత్వ ఆసుపత్రులల్లో అభివృద్ధి కమిటీల జాడేదీ…?

సమావేశాలు లేక ఆసుపత్రుల్లో వసతుల లోపం.

రాష్ట్రంలో కొన్ని ప్రభుత్వాసుపత్రులల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ఏర్పాటైన ఆసుపత్రి అభివృద్ధి కమిటీల ఊసే లేదు.జిల్లా ఆసుపత్రులకు జడ్పీ చైర్మన్లు,పీ.హె.చ్సీలకు ఎంపీపీలు ఛైర్మన్లుగా వ్యవహరించే అభివృద్ధి కమిటీల్లో స్థానికంగా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.చాలా రోజుల నుండి ప్రభుత్వ ఆసుపత్రులలో అభివృద్ధి కమిటీలు లేక ఆస్పత్రుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.ప్రతి మూడు నెలలకు ఒకసారి జరగాల్సిన కమిటీల సమావేశాలు నిర్వహించడం లేదు.మరోవైపు ఆస్పత్రులకు అరకొరగా నిధులు వస్తుండటంతో అభివృద్ధి పనులు చేయలేని పరిస్థితి నెలకొంది

ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి సరిపడా నిధులు మంజూరు కావడం లేదు.దీంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు

ఒకవైపు నిధుల కొరతతో..ప్రజాప్రతినిధులు పట్టించుకోకుండా..అభివృద్ధి కమిటీల ఏర్పాటు చేయకపోవడం వల్ల ఆసుపత్రుల్లో సరిపడా మందులు అందుబాటులో లేక రోగులు అవస్థలు పడుతున్నారు.తాగునీటి వసతి కూడా సరిగ్గా లేదు.పలు చోట్ల ఫ్యాన్లు,ట్యూబ్ లైట్ లు పని చేయడం లేదు.ప్రధాన వార్డుల్లో పరిసరాలు అపరిశుభ్రంగా కనిపిస్తూ..ఆస్పత్రుల అభివృద్ధి కుంటుపడుతుంది

ఈ అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేస్తే సమావేశాలకు,ఆసుపత్రులకు ఎమ్మెల్యేలు,జిల్లాసుపత్రులకు కలెక్టర్,జడ్పీ ఛైర్మన్లు అధ్యక్షత వహిస్తారు.P.H.C లకు ఏటా రెండు పర్యాయాలు కలిపి గరిష్టంగా రూ.1.70 లక్షల వరకు నిధులు మంజూరవుతాయి.అభివృద్ధి కమిటీ ఆమోదం మేరకు ఈ నిధులు వసతుల కల్పనకు వినియోగించాల్సి ఉంటుంది. ఇప్పటికైనా..రాష్ట్ర,జిల్లా స్థాయి అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రులలో అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి!