రహదారి కాదది… నరకానికి దారి మనకొండూరు రోడ్డు పై పెద్ద రంధ్రం
హుజురాబాద్ :
కరీంనగర్ పట్టనానికి అతి సమీప మండల కేంంద్రం మనకొండూర్ రహదారి పై పెద్ద బుంగ ఏర్పడినప్పటికీ అధికారులకు, పాలకులకు కనపడక పోవడం ఈ ప్రాంత ప్రజల దురదృష్టంగా భావిస్తున్నారు. పాద చారులు, సైకిలిష్ట్లు , ద్విచక్ర , భారీ వాహన చోదకులు ఆ గోతి లో పడిపోతే ఇక అంతే సంగతులు ..అసలే ఈ దారి గుండా పోయే వాహనాలు ప్రతి రోజు ప్రమాదాలకు గురి అవుతున్నాయి. స్వల్ప, తీవ్ర గాయాలు, మృతులు సంభవిస్తున్నాయి. ప్రజల మాన ప్రాణాలు కాపాడడం మా బాధ్యత అనే అధికారులు రోడ్డు పై ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు.
బుంగ ఏర్పడిన ప్రదేశంలో కర్వ్ ఉంది. ఎదురెదురుగా వచ్చే వాహనాలు ఇక్కడ కన్ఫ్యూజ్ ఔతుంటారు. ఈ ప్రదేశంలోనే రోడ్డుపై మూడు ఫీట్ల వెడల్పుతో భారీ రంధ్రం ఏర్పడం ప్రమాదాలకు ఆజ్యం పోషినట్లవుతుంది . మానకొందూర్ గ్రామానికి వెల్లె దారికి సమీపంలో చెరువు కట్ట వద్ద ఈ బుంగ ఉంది. ఈ బుంగ ఏర్పడి దాదాపు నెల రోజుల అవుతున్న ఎవ్వరికీ కనపడక పోవడం పట్ల ఈ జాతీయ రహదారి గుండా పోయే వారు విమర్శిస్తున్నారు. ఈ దారి గుండ జిల్లా ఉన్నతాధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇప్పటికైనా బుంగను పూడ్చి ప్రజల భద్రత కోసం పాటు పడాలని కోరుతున్నారు