జగిత్యాల జిల్లా…
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
గ్రామంలో ఎలాంటి సమస్యలో ఉన్న పోలీసులను నిర్భయంగా సంప్రదించండి.
నూతన చట్టాలతో మహిళలకు మరింత రక్షణ
జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ గారు.
మావోయిస్టు ముప్పాల లక్ష్మణ్‌రావు స్వస్థలమైన బీర్పూర్ గ్రామాన్ని ఎస్పీ గారు సందర్శించారు.
నక్సల్ భావజాలానికి మద్దతు ఇవ్వకుండా తప్పుడు మావోయిస్టు భావజాలం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.
అనంతరం ఈరోజు బీర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగేలా గ్రామంలో కళాబృందం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ…
భారత దేశ వ్యాప్తంగా నూతన చట్టాలు అమలు చేయడం జరిగిందని మహిళలకు, పిల్లలకు నూతన చట్టాలు మరింత అండగా మరియు రక్షణగా నిలుస్తాయని తెలిపారు.
నూతన చట్టాలలో నేరస్తులకు కఠిన శిక్షలు అమలు చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లా లోని మహిళలు, యువతులు ఎలాంటి సమస్యలున్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చని తెలిపారు.మహిళలు, బాలికల, విద్యార్థిని విద్యార్థుల రక్షణకు పోలీస్ శాఖ తరఫున షీ టీమ్, AHTU టీమ్ లు పనిచేస్తునయని అన్నరు .
షీ టీమ్ సభ్యులు ప్రత్యక్షంగా ఫిర్యాదులు తీసుకుంటారని లేదా 8712670783 వాట్సప్ ద్వారా కూడా పిర్యాదులు స్వీకరిస్తారని తెలిపారు.యవత విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా మంచిగా చదువుకొని ఉన్నత లక్షలను సాధించాలన్నారు.
మత్తు పదార్థాలకు మానసికగా బానిస కావడం ద్వారా అనుకోకుండా క్రైమ్ చేసే అవకాశం ఉంది అని అన్నారు. అనుకోకుండా ఏదైనా క్రైం చేసినట్లయితే ఎలాంటి ఉద్యోగం కూడా రాదని కావున డ్రగ్స్,గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో ఉన్నత లక్ష్యాల ను సాదంచాలనీ సూచించారు.
తల్లిదండ్రులు కూడా తమ పిల్లల నడవడికను, అలవాట్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, యువత ఎక్కువగా మత్తుకు బానిస అవుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, డ్రగ్స్, మత్తు పదార్థాలు, గంజాయి గురించిన సమాచారం తెలిస్తే ప్రజలు, స్థానిక పోలీసులకు గాని, డయల్ -100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని అన్నారు.
గంజాయి రవాణా, గంజాయి సేవించే వారిపై పటిష్ట నిఘా ఉంటుందని, శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పి గారు హెచ్చరించారు. ఎవరైనా అక్రమంగా గుడుంబా తయారీ చేసినట్లయితే వారిని బైండోవర్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
అంతే కాకుండా మీ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఎవరైనా గుడుంబా తయారీ చేస్తునట్టు తెలిసిన, అమ్మిన వెంటనే పోలీసు స్టేషన్ కి సమాచారం అందించాలని కోరారు. ప్రస్తుత రోజుల్లో అనేక సైబర్ మోసాలు బాగా పెరిగాయి వీటి నుంచి బయటపడేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.
సైబర్ నేరాల బారిన పడిన వెంటనే ఆలస్యం చేయకుండా సొమ్ములు తిరిగి పొందేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 1930 ను ఆశ్రయించాలి అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మకూడదని అట్లాంటి వాటి పై వెంటనే పోలీసువారికి తెలుపాలని సూచించారు,గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగింది పోలీసులకు సమాచారం అందించాలని అన్.జిల్లా నుంచి గల్ఫ్ వెళ్ళేవారు నకిలీ ఏజెంట్లకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దు.
ఇమ్మిగ్రేషన్, చట్టబద్ధత ఉన్నవారు నుంచి వీసాలు పొందాలి ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి గల్ఫ్ మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు చేపడతాం. బాధితుల ఫిర్యాదు చేస్తే తక్షణమే కేసులు నమోదు చేస్తాం అన్నారు.
ఈ సందర్భంగా యువతకు వాలీబాల్ , క్రికెట్ కిట్ లను, బుక్స్ ను ఎస్పీ గారి చేతుల మీదుగా చేయడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో డిఎస్పి రఘు చంధర్, సి.ఐ కృష్ణా రెడ్డి ఎస్.ఐ కుమారస్వామి, పోలీస్ సిబ్బంది , గ్రామస్తులు పాల్గొన్నారు