తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియామకం.,
ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
ప్రస్తుతం ఆయన హోంశాఖ ముఖ్య కార్యదర్శి, విజిలెన్స్-ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పంజాబ్‌లోని జలంధర్‌లో జన్మించిన ఆయన 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. వచ్చే ఏడాది సెప్టెంబరుతో ఆయన పదవీ కాలం ముగియనుంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియమితులైన ఫస్ట్ డీజీపీ జితేందర్. 1992 ఐపీఎస్ అధికారి అయిన ఆయన ఏపీ కేడర్‌కు ఎంపికయ్యారు. తొలుత నిర్మల్ ఏఎస్పీగా పనిచేసిన ఆయన, ఆ తర్వాత బెల్లంపల్లి ఎస్పీగా పని చేశారు. నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పని చేసిన అనుభవం ఆయన సొంతం.
మహబూబ్‌నగర్, గుంటూరు ఎస్పీగా కాకుండా తర్వాత సీబీఐలో పని చేశారు. తర్వాత డీఐజీగా పదోన్నతి పొందిన ఆయన విశాఖ రేంజ్లో బాధ్యతలు చేపట్టారు. కొంతకాలం అప్పాలో కూడా విధులు నిర్వహిం చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీగా కొనసాగారు. వివిధ విభాగాల్లో పని చేసిన జితేందర్, ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు.
డీజీపీగా నియమితులైతే 14నెలలపాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. ఈ లెక్కన తెలుగు రాష్ట్రాల్లో పని చేసిన అనుభవం ఆయన సొంతం. అయితే గంజాయిపై కొత్త డీజీపీ ఉక్కుపాదం మోపే ఛాన్స్ ఉందని అంటున్నారు. కొత్త డీజీపీ నియామకంతోపాటు హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కొంతమంది ఐపీఎస్‌లకు స్థాన చలనం కలిగే ఛాన్స్ ఉందని సమాచారం.