జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్ల ఆందోళన

జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్ల ఆందోళన

ఆర్టీసీ రిక్రూట్మెంట్ లో 50 శాతం అవకాశం కల్పించాలంటూ డిమాండ్

జగిత్యాల జిల్లా :

అద్దె బస్సు డ్రైవర్లకు ఆర్టీసీ రిక్రూట్మెంట్ లో 50% అవకాశం కల్పించాలని కోరుట్ల బస్టాండ్ ఎదుట డ్రైవర్లు ఈరోజు ఆందోళన చేపట్టారు.

బుధవారం జగిత్యాల జిల్లా కోరుట్ల డిపోకు చెందిన అద్దె బస్సుల డ్రైవర్లు ఈరోజు ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగాల్లో అద్దె బస్సు డ్రైవర్లకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు.

ఎప్పటికైనా మమ్మల్ని ఆర్టీసీలో విలీనం చేస్తారని నమ్మకం తో ఇప్పటివరకు ఉద్యోగాలు కొనసాగించా మని,ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఆర్.టి.సి అద్దె బస్సుల పైన ఆధారపడి ఆర్టీసీ సంస్థలో డ్రైవర్లుగా పనిచేస్తున్న మాకు ఆర్టీసీ ఉద్యోగాల్లో మొదటి ప్రాధా న్యత ఇవ్వాలని ప్రభుత్వా న్ని కోరారు.

కరోనా కష్టకాలంలో కూడా మా ప్రాణాలు లెక్క చేయ కుండా ఆర్టీసీ బస్సులు నడిపిస్తూ ప్రజలను గమ్యస్థానాలకు చేర్చడంలో మా ప్రైవేట్ డ్రైవర్లు కీలక పాత్ర పోషించమన్నారు.

15 ఏండ్లకు పైగా అద్దె బస్సుల్లో చాలీచాలని జీతాలతో డ్రైవర్ గా పని చేస్తున్న మాకు ప్రభుత్వం ఇచ్చిన రిక్రూట్మెంట్ లో మొదటి ప్రాధాన్యత కల్పించాలని వారు కోరారు..

అద్దె బస్సు డ్రైవర్లను పర్మనెంట్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..