రతన్ టాటా టెలికాం లో విప్లవం తీసుకురాబోతున్నారా…?
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా ఒకటే చర్చ టెలికాం రంగంలో రతన్ విప్లవం తీసుకురాబోతున్నారా అని వార్తలు దావాలంగ వ్యాప్తి చెందుతున్నాయి. ప్రస్తుతం ఎయిర్టెల్ జియో వీఐ నెట్వర్క్ లు విపరీతంగా ధరలు పెంచేశాయి. దీంతో సబ్స్క్రైబర్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ కు అలవాటైపోయారు. ఇదే అదునుగా భావించిన నెట్‌వర్క్‌లు తమ రీఛార్జ్‌లను విపరీతంగా పెంచేశాయి. దీంతో ఒక్కసారిగా రతన్ టాటా టెలికాం రంగంపై దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది.బిఎస్ఎన్ఎల్ తో రతన్ టాటా 15,000 కోట్లతో ఒప్పందం చేసుకున్నారని సమాచారం… బిఎస్ఎన్ఎల్ తో కలిసి టెలికాం రంగాన్ని విస్తరించేందుకు రతన్ టాటా సిద్ధపడుతున్నారు.
ఆగస్టులో బిఎస్ఎన్ఎల్ 4g నీ లాంచ్ చేయడంతో పాటు 2025 కల్లా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ని 5జీగా అప్డేట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాదు కేవలం 249 రూపాయలకే 45 రోజుల పాటు 2gb డేటా ఫ్రీ కాల్స్ అందించే సదుపాయాన్ని బిఎస్ఎన్ఎల్ అందించబోతుంది. నాణ్యమైన సేవలతో బిఎస్ఎన్ఎల్ ప్రజలకు మరింత చేరువవుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు బిఎస్ఎన్ఎల్ ఫ్రీ సిములు కూడా అతి త్వరలో అందరికీ అందించే కార్యక్రమం బిఎస్ఎన్ఎల్ చేపట్టబోతుంది. తక్కువ రీఛార్జికే టెలికాం సేవలు అందించేందుకు సిద్ధమవుతున్న రతన్ టాటా పై దేశ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.