కోచింగ్ సెంట‌ర్ల వ్యాపారం కోస‌మే పోటీ ప‌రీక్ష‌ల వాయిదాలు కోరుతున్నారు

కోచింగ్ సెంట‌ర్ల వ్యాపారం కోస‌మే పోటీ ప‌రీక్ష‌ల వాయిదాలు కోరుతున్నారు..

వాయిదాలు కోరుతూ నిరాహార దీక్ష‌ల్లో పేద విద్యార్థులే కూర్చుంటున్నారు ఎందుకు….?

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.

మీరు చెప్పింది నిజ‌మే కావ‌చ్చు స‌ర్‌……. కానీ,

ఓ ఏడాది వెన‌క్కి వెళ్లండి…

1.బీఆర్ఎస్ వేసిన ప్ర‌తి నోటిఫికేష‌న్‌పై కేసులేసి ముందుకు వెళ్ల‌కుండా చేసింది ఎవ‌రు? మీ పార్టీ వాళ్లే క‌దా?

2. ప‌రీక్ష‌లు వాయిదా వేయాల‌ని స్వ‌యంగా మీరు కూడా డిమాండ్ చేసిన‌ట్టు గుర్తు.. అప్పుడు ఏ సోయిన ఉన్నారు?

3. నాడు కూడా నిరాహార దీక్ష‌లు చేసింది పేద విద్యార్థులే.. క‌లిగిన‌వారు ఉద్యోగాలు ఎగ‌రేసుకొని పోతే.. దీక్ష‌లు చేసిన పేద‌లు రోడ్డున ప‌డ్డారు? నాడు ఆ పేద విద్యార్థుల‌తో దీక్ష‌లు చేయించింది కూడా మీ పార్టీ వాళ్లే..

మ‌రొక్క మాట‌………. ఎన్నిక‌ల ముందు..

1.కాంగ్రెస్‌ను గెలిపిస్తే గ్రూప్ -1 మెయిన్స్‌కు 1:100 తీస్త‌మ‌న్న‌ది మీరే.

2.మెగా డీఎస్సీ ఏస్త‌మ‌న్న‌ది మీరే.. (దీనమ్మ మెగా డీఎస్సీ అనేది బూతు అయిపోయింది. ఐదారు వేల పోస్టుల‌కు కూడా మెగా డీఎస్సీ అని జ‌బ్బ‌లు చ‌రుచుకొంటున్నారు)

3. గ్రూప్‌-2, 3లో పోస్టులు పెంచుతామ‌న్న‌ది మీరే..

ఇవన్నీ ఏవి? ఎక్క‌డ‌?

బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం నింపిన పోస్టుల‌కు.. మీరేదో పొడిసిన‌ట్టు ఎల్బీ స్టేడియంలో స‌భ పెట్టి, మొత్తం భూమి బ‌ద్ద‌ల‌య్యేట‌ట్టు అట్ట‌హాసం చేసి ఉద్యోగ నియామ‌క ప‌త్రాల పేరుతో కాయితాలు ఇచ్చారు. అవి ఇచ్చి కూడా నాలుగు నెల‌లు అయిపాయె. మ‌రి వారికి పోస్టింగులు ఎప్పుడు ఇస్తారు?

పాపం టీచ‌ర్లు.. ఉద్యోగాలు వ‌చ్చాయ‌న్న సంతోషంలో ఉన్న ప్రైవేటు ఉద్యోగాలు మానేసి ఇంట్ల కూర్చున్నరు. ఇటు మీరు పోస్టింగులు ఇవ్వ‌రు. అటు ఆ ఉద్యోగం పాయె.. వాళ్లు అప్పులు చేసి బ‌తుకుతున్న‌రు. ఇదేనా మీరు నిరుద్యోగుల‌ను ఆదుకొంటున్న తీరు..పోనీ.. పోస్టింగులు ఇచ్చిన‌వారికి జీతాలైనా ఇస్తున్నారా? అంటే అదీ లేదు. ఏం పాల‌న ఇది?
ఈడ తెలంగాణోళ్ల‌ను ఏదో ఉద్ధ‌రించిన‌ట్టు.. తెలంగాణ‌కు బ‌ద్ధ విరోధి అయిన వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి విజ‌య‌వాడ పోయి నివాళులు అర్పించి వ‌చ్చారు.మీ టెంప‌ర్ చూస్తుంటే..

ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ‌ అన్న‌ట్టుగా ఉన్న‌ది.

కేసీఆర్‌నే ఇంటికి పంపిన తెలంగాణ బిడ్డ‌ల‌కు, నిరుద్యోగుల‌కు నిన్ను త‌రిమేయ‌టం పెద్ద కష్ట‌మేమీ కాదు. అది గుర్తుంచుకొంటే మంచిది.