స్కూల్ భవనం కూలి… 22 మంది విద్యార్థులు మృతి

స్కూల్ భవనం కూలి… 22 మంది విద్యార్థులు మృతి

హైదరాబాద్ :

ఉత్తర మధ్య నైజీరియాలో శుక్రవారం ఉదయం పెను ప్రమాదం సంభవిం చింది.రెండంతస్తుల పాఠశాల భవనం కూలి పోయింది. తరగతులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది

ఈ ప్రమాదంలో 22 మంది విద్యార్థులు మృతి చెందగా, 100 మందికి పైగా విద్యా ర్థులు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న విద్యా ర్థులను బయటకు తీసేందుకు.. రిలీఫ్‌ అండ్‌ రెస్క్యూ టీమ్‌లు ఘటనా స్థలికి చేరుకున్నాయి.

పీఠభూమి రాష్ట్రంలోని బుసా బుజి కమ్యూనిటీ లోని సెయింట్స్ అకాడమీ కాలేజీకి చెందిన భవనం. తరగతులు ప్రారంభమైన కొద్దిసేపటికే పాఠశాల భవనం కుప్పకూలింది. ప్రమాదంలో గాయపడిన వారిలో చాలా మంది 15 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఉన్నట్లు సమాచారం.

మొత్తం 154 మంది విద్యా ర్థులు చిక్కుకుపోయారని, అయితే వారిలో 132 మందిని రక్షించామని పోలీసు అధికార ప్రతినిధి ఆల్ఫ్రెడ్ అలబో తెలిపారు.

విద్యార్థులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో 22 మంది విద్యార్థులు మృతి చెందారు…