జగిత్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు పట్టణ పోలీస్ ల విజ్ఞప్తి

జగిత్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు పట్టణ పోలీస్ ల విజ్ఞప్తి..

ఈ క్రింది ఫోటోలో కనిపిస్తున్న గధ వ్యక్తి 2 రోజుల క్రితం జగిత్యాల పట్టణంలో గల ఒక బట్టల షాపుకు నెంబర్ ప్లేట్ లేని పల్సర్ ద్విచక్ర వాహనంపై వెళ్లి ఆ షాపులో 3 చీరలు కొనుగోలు చేసి వాటి విలువ డబ్బులు 2200/- కాగా తర్వాత నా దగ్గర నగదు డబ్బులు లేవు ఫోన్ పే చేస్తాను అని చెప్పి డబ్బులు అత్యవసరం ఉన్నదని చెప్పి మొత్తం కలిపి ఒక 10000/- రూపాయలు నగదు ఇవ్వండి నేను మీకు ఫోన్ పే చేస్తాను అని చెప్పగా షాపు యజమానురాలు స్కానర్ చూపించగా అట్టి స్కానర్ పనిచేయడం లేదు ఇంకొక నెంబర్ చెప్పండి అని అడగగా ఆమె,ఆమె యొక్క భర్త నెంబర్ కు ఫోన్ పే చేయమని చెప్పగా వెంటనే అతడు 10,000/- రూపాయలు ఫోన్ పే ద్వారా ట్రాన్సాక్షన్ అయినట్టు ఫేక్ మెసేజ్ ఆమెకు చూపించి ఆమె దగ్గర 10,000/- రూపాయలు నగదు తీసుకొని వెంటనే అక్కడనుండి పారిపోయాడు. తరువాత వారు వచ్చి జరిగిన మోసాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

కావున జగిత్యాల ప్రజలు గమనించి ఇలాంటి మోసపూరితమైన వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండవలసిందిగా జగిత్యాల పట్టణ పోలీసు వారు కోరుచున్నారు ఇలాంటి వ్యక్తులు ఎవరి దృష్టికి వచ్చిన వెంటనే మాకు 100 డయల్ కి ఫోన్ చేసి సమాచారం అందించగలరు. అలాగే ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తిని ఎవరైనా గుర్తుపట్టినచో మాకు సమాచారం అందించగలరు.

ఇట్లు :
జగిత్యాల పట్టణ ఇన్స్పెక్టర్ S.వేణుగోపాల్