BRS పార్టీ జగిత్యాల జిల్లా కార్యాలయం లో BRS పార్టీ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అధ్యక్షతన పత్రిక విలేఖరుల సమావేశం ముఖ్యంశాలు….
కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ…
1)తప్పుడు వాగ్దానాలు, నెరవేర్చని హామీల తో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలను,రైతులను, నిరుద్యోగులను మోసం చేసిందని రైతులు మక్క, పసుపు, వరి పంటలు సాగు చేసుకున్న కూడా ఇంతవరకు రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఇస్తామన్నా 15000/- ఇవ్వలేదు.. కనీసం కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు కింద ఇచ్చిన 10000/-ఇవ్వక రైతు భరోసా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి కాలయాపన చేస్తున్నారని దుయబట్టారు…
ముఖ్యమంత్రి ద్రుష్టి ఎమ్మెల్యే ల కొను గోలు, బ్లాక్ మెయిల్, బెదిరింపులు చేసి పార్టీలో చేర్చుకుంటున్నారు అని,,
రుణమాఫీ విషయం లో
కేంద్రప్రభుత్వం చేపట్టిన కిసాన్ సమ్మాన్ విధానాలు చేపట్టి రైతులకు రుణమాఫీకి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని,,
ఎమ్మెల్యే ల కొనుగోలు పై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని… ప్రజలను మోసం చేశారు కాబట్టి క్షమాపణ చెప్పాలి..
4000/-పెన్షన్ లేదు,మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించిన దాన్ని మహిళలే వద్దు అంటున్నారని బస్ లు సరిపోక ఎక్కువ ప్రయాణికులు ఉండటం వల్ల రాయితీ సౌకర్యం కల్పించాలని చెబుతున్నారని..
యువకులు, నిరుద్యోగులు ఉద్యోగాల కోసం పోస్టులు పెంచాలని డి. యస్. సి, గ్రూప్స్ అభ్యర్డులు ఆందోళన చేస్తున్నాకూడా పట్టించుకోవడం లేదని…
2 లక్షల ఉద్యోగాల నియామకం చేపట్టాలని డిమాండ్ చేశారు..
ఎమ్మెల్యే లను భయపెట్టి, భయబ్రాంతులకు గురిచేసి తీసుకోకండి!
మేము ఎక్కడ బ్లాక్ మెయిల్ చేయలేదు.. పద్దతి మార్చుకోండి.. దుర్మార్గమైన పాలన చేయకండి అని పేర్కొన్నారు..
జగిత్యాల నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు నేను, లోక బాపు రెడ్డి, దావ వసంత అందుబాటులో ఉండి అండగా ఉంటామని తెలిపారు..
దావ వసంత మాట్లాడుతూ…
కాంగ్రెస్ సీనియర్ నయకులు జీవన్ రెడ్డి గారు చేసిన విమర్శలను తిప్పికొడుతూ గతంలో కాంగ్రెస్ హయాంలో గ్రూప్స్ పరీక్షల విషయం లో 4సార్లు టాంపరింగ్ చేసారని,హై కోర్ట్ మొట్టికాయలు వేసిన విషయం మర్చిపోయారా… అని పేర్కొన్నారు..
మా ప్రభుత్వ హయం లో 1.31,000ఉద్యోగాల భర్తీ చేశామని..
26000 వేల ఉద్యోగాల భర్తీలో 75%ప్రాసెస్ చేశామని మేమంతా పూర్తి చేసిన తర్వాత మీరు నియామక పత్రాలు ఇచ్చారని దానిలో కూడా గురుకుల ఇతర ఉద్యాగాలు పెండింగ్ ఉన్నాయని,,
నిరుద్యోగులపై చిత్తశుద్ధి ఉంటే మొత్తం ఉద్యోగాలు భర్తీ చేయాలనీ…
జాబ్ క్యాలెండర్ ప్రకటించి మెగా డి యస్ సి వేయాలని…
పూటకో మాట మాట్లాడుతూ నిరుద్యోగులను ఆందోళనకు గురవుతున్నారని, కంటతడి పెట్టుకుంటున్నారని..
స్థానిక సంస్థల సర్పంచుల పదవి కాలం ముగిసి సుమారు 6నెలలు గడిచిన ఎన్నికల నిర్వహించకపోవడం వాటిని వాయిదా వేయడం,,,
నిరుద్యోగులు చదువుకుంటాం కొన్ని రోజులు వాయిదా వేయండని కోరిన వినిపించుకోకపోవడం…
రుణమాఫీ విషయం లో మార్గదర్శకాలు మభ్యపెట్టే విధంగా ఉన్నాయని…
ఆషాడం అయిపోతుంది శ్రావణం వచ్చేనాటికి వివాహ ముహుర్తాలు ఉంటాయి కాబట్టి
ఎమ్మెల్యే బి ఆర్ యస్ లో ఉన్నప్పుడు అంతకుముందు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ విషయం లో తులం బంగారం గురుంచి ప్రశ్నిoచారని మరి ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాలని…
తులం బంగారం ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు..
జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి నూకపెల్లి డబుల్ బెడ్ రూమ్ మంజూరులో అప్పటి ఎంపీ కవిత సహకారంతో మంజూరు అయినవని తెలిపారు..
లోక బాపు రెడ్డి మాట్లాడుతూ…
మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలనీ రైతoగానికి పెట్టుబడి సహాయం, బోనస్ ఇవ్వాలని కేసీఆర్ రెండు సార్లు ఒక లక్ష రుణమాఫీ చేశారని,,
డిసెంబర్ 9లోపు 2లక్షల ఋణం తెచ్చుకోండ్రి అని చెప్పిండ్రని…
హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు…
జిల్లా పార్టీ కార్యాలయంలో జగిత్యాల రూరల్ మండలం బి ఆర్ యస్ పార్టీ ఉపాధ్యక్షులు పడిగేలా గంగారెడ్డి జన్మదినం సందర్బంగా కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్,మాజీ మార్కుఫెడ్ చైర్మన్ లోక బాపు రెడ్డి, మాజీ జడ్పీటీసీ కోల్ముల రమణ, కౌన్సిలర్లు తురగ శ్రీధర్ రెడ్డి, ఎలిగేటి అనిల్ కుమార్, మహేష్ గౌడ్ బి ఆర్ యస్ సీనియర్ నాయకులు అమీన్ బాయ్,శీలం ప్రవీణ్, నక్క గంగాధర్, చింతల గంగాధర్,సల్మాన్, ఈతేమద్ ఉల్ హాక్,పడిగేలా గంగా రెడ్డి,నీలి ప్రతాప్,ప్రణయ్, భగవాన్, గాజుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..