రుణమాఫీలో గందరగోళం… ప్రభుత్వ ఉద్యోగులకు మాఫీ… గతంలో మాఫీ పొందిన రైతులకు తిరిగి మాఫీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెండు లక్షల రుణమాఫీ పథకం లో గందరగోళం అయోమయం నెలకొన్నది, ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణాన్ని వెంటనే మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం మూడు విడతలుగా మాఫీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నది.
ఇందులో భాగంగా గురువారం లక్ష రూపాయల వరకు పంట రుణం పొందిన రైతులకు మొదటి విడతగా ప్రభుత్వం ఖాతాలో జమ చేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయం కానీ మొదటి విడత లక్ష రూపాయల రుణమాఫీలో లబ్ధిదారుల జాబితాలో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మాఫీ అయ్యాయి.
వీరితోపాటు గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష రూపాయల లోపు పంటలను పొందిన రైతులు గత ప్రభుత్వ హయాంలో బ్యాంకులో పంట రుణం మాఫీ పొందినప్పటికీ మళ్లీ తిరిగి పంట రుణం తీసుకోవడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీలో రెండవసారి రుణమాఫీ పొందడం జరిగింది.
కథ టిఆర్ఎస్ ప్రభుత్వంలో లక్ష రూపాయల రుణమాఫీ పూర్తిగా చేయకపోవడం వల్ల లక్షలాది మంది రైతులు రుణమాఫీకి నోచుకోలేదు కనీసం ఇప్పుడైనా తమ రుణమాఫీ అవుతుందని భావించిన రైతంగం చివరకు గతంలో రుణమాఫీ పొందిన రైతులకు మళ్ళీ మాఫీ పొందడం పట్ల ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బ్యాంకులలో అధికారులు కూడా రైతులకు సరైన సమాచారం ఇవ్వకుండా రెండు లక్షల రూపాయల పంట రుణమాఫీ సంబంధించిన జాబితాను బ్యాంకుల్లో ప్రచురించకుండా రైతుల పట్ల బ్యాంకర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు.
కేవలం లక్ష రూపాయల రుణం తీసుకున్న రైతులకు మాత్రమే ప్రస్తుతం మాఫీ అయ్యింది, ఆ తర్వాత 1,50,000మూడో విడతలో రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు 15 లోపు పూర్తి చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఎందుకు సంబంధించిన అర్హుల జాబితా బ్యాంకుల్లో రైతులకు అందుబాటులో ఉంచాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు.
లక్ష రూపాయలు రుణం తీసుకున్న రైతుల జాబితాను ఒక్కసారి పరిశీలించాలని ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం ఐటి రిటర్న్స్ మరియు ప్రభుత్వ ఉద్యోగులకు రాజకీయ నాయకులకు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలకు ఈ పథకం వర్తించదని ముందుగా ప్రకటించినప్పటికీ లక్ష రూపాయల జాబితాలో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నట్లు జాబితా పరిశీలించిన రైతులు అంటున్నారు, ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వ ఉద్యోగులకు రుణమాఫీని నిలుపుదల చేయాలని గతంలో ఎప్పుడు పంట రుణం పొందని రైతులు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ రుణమాఫీలో తీవ్ర జాప్యం అయోమయం నెలకొన్నదని వెంటనే రెండు లక్షల వరకు పంట రుణమాఫీని చేయాలని ఆ పైన ఉన్న డబ్బు రైతులు తిరిగి బ్యాంకుకు చెల్లించకుండా బ్యాంకులు పంట రుణాలను రెనివల్ చేసి రైతులకు ఎకరాకు లక్ష రూపాయల చొప్పున పంట రుణాలను అందించాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు.
పెరుగుతున్నదాలకు అనుగుణంగా వ్యవసాయంలో పెట్టుబడును పెరగడం కూలీ ధరలు, యంత్రాల ధరలు, క్రిమిసంహారక మందులు, పెరగడం వల్ల దానికి అనుగుణంగా పంట రుణాన్ని కూడా పెంచాలని రైతులంటున్నారు.
ప్రభుత్వం రుణమాఫీ విషయంలో జాగ్రత్త పాటించాలని ఎక్కడ ఎలాంటి సమస్య రాకుండా రైతులకు ఇబ్బంది కలగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని బ్యాంకు అధికారుల మొండి వైఖరిని ప్రభుత్వం ఎండగట్టాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు.