వ్రాత పరీక్ష లేకుండా 2 వ ANM లను రెగ్యులర్ చేయాలి ఉద్యోగ భద్రత కల్పించి మాకు న్యాయం చేయాలి
వైధ్య ఆరోగ్య శాఖ మంత్రికి సెకండ్ ANMల సంఘం జిల్లా అధ్యక్షురాలు మధురిమ విజ్ఞప్తి
తెలంగాణ వైద్య ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ ఎన్ హెచ్ ఎం లో గత 17ఏళ్లుగా పనిచేస్తున్న 5600 మంది సెకండ్ ఏ ఎన్ ఎం లను గత ప్రభుత్వం పట్టించుకోలేదని మీరైనా మాకు న్యాయం చేసి మా ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ను సెకండ్ ఏ ఎన్ ఎం ల సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షురాలు గాండ్ల మధురిమ కోరారు.
మొదటి ఏ ఎన్ ఎం లతో సమానంగా సుమారు 17 ఏళ్లుగా రెండవ ఏఎన్ ఎం లు పనిచేస్తున్న మమ్మల్ని బీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యులర్ చేయకుండా తీరని అన్యాయo చేసి దని ఇప్పటికైనా కాంగ్రెసు ప్రభుత్వం మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని మధురిమ ప్రభుత్వాన్ని కోరారు.
గురువారం హైదరాబాద్ లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను మధురిమ ఏఎన్ఎం లతో కలిసి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమస్యలు పరిష్కటించాలని కోరుతూ సైతం లేఖ రాశారు.
ప్రజల ఆరోగ్యంతో పాటు అన్నిరకాల వ్యాధుల నిర్ములనకు కృషి చేస్తున్న రెండవ ఏఎన్ఎం , యూపిహెచ్సి , కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ లో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 5600 వేల మంది ఏఎన్ఎం ల సమస్యలను పరిష్కారించాలన్నారు.
క్షేత్ర స్థాయిలో ప్రజారోగ్యాన్ని కాపాడుతున్న మమ్మల్ని పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.
సమస్యల పరిష్కారానికి మంత్రి సానుకూలంగా స్పందించారని మధురిమ తెలిపారు.
ఈసందర్భంగా మధురిమ మాట్లాడుతూ గత ఏడాది జులై నెలలో విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దు చేసి ఉద్యోగాలను పెంచి సీనియారిటీ ప్రకారం విడతల వారిగా రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఏలాంటి రాత పరీక్షలు లేకుండా ప్రభుత్వం మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలన్నారు.
కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, కుటుంబాలను వదిలి సేవలందిస్తే ఇతర డిపార్ట్మెంట్ లో పనిచేసిన వారిని రెగ్యులరైజ్ చేసి మమ్మల్ని గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.
ఆరోగ్య శాఖలో కీలకంగా పనిచేస్తున్న మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి రాష్ట్రంలోని సుమారు 6 వేల మందికి న్యాయం చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. మాకు ఉద్యోగ భద్రతను కల్పిస్తూ రాబోయే రోజుల్లో ప్రభుత్వం నియామకం చేసే 2 లక్షల ఉద్యోగాల్లో రెండవ ఏఎన్ఎం లను రెగ్యులర్ చేసి మాకు కుటుంబాలకు న్యాయం చేయాలని కోరినట్లు మధురిమ వివరించారు.
సమస్యలపై సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రితో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారని మధురిమ వివరించారు. మంత్రిని కలిసిన వారిలో పార్వతి, జ్యోతి, శైలజరానీ,అరుణ, ప్రియాంక,సుజాత, పద్మ, తన్విర్,సత్యవతి, శ్యామల,సుజాత, ప్రవీణ్ తదితరులున్నారు.