లబ్ధిదారులకు త్వరలో కొత్త రేషన్ కార్డులు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల లో 25 వేల కోట్ల రైతు రుణమాఫీ మాత్రమే చేస్తే. కాంగ్రెస్ 8 నెలల్లోనే 31 వేల కోట్ల రైతు రుణం తీర్చబో తోందన్నారు.
ఈరోజు రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.మాట్లాడుతూ..
తెల్ల రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఇక నుంచి ఆరోగ్యశ్రీ అందుబాటులోకి తీసుకు వస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులను వేర్వేరుగా ఇస్తున్నట్లు చెప్పారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని సైతం ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
అందుకు సంబంధించిన విధివిధానాలను త్వరలో వెల్లడిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..