రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలాన్ స్కామ్ కేసు..
ఛార్జిషీట్ సిద్ధం చేసిన బెజవాడ పోలీసులు..
2021లో రిజిస్ట్రేషన్ శాఖలో నకిలీ చలాన్ల కుంభకోణం.
రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలాన్ స్కామ్ కేసులో ఛార్జిషీట్ సిద్ధం చేశారు బెజవాడ పోలీసులు..
2021లో రిజిస్ట్రేషన్ శాఖలో నకిలీ చలాన్ల కుంభకోణం వెలుగుచూసిన విషయం విదితమే కాగా.. సర్టిఫైడ్ కాపీల లావాదేవీల కోసం పటమట సబ్ రిజిస్ట్రార్ కి నోటీసులు ఇచ్చారు బెజవాడ పోలీసులు.. దీంతో.. పటమట సబ్ రిజిస్ట్రార్ ససంబంధిత కాపీలు అందించారు.. ఇంకా నలుగురు నిందితులు డబ్బులు తిరిగి చెల్లించాల్సి ఉందని బెజవాడ పోలీసులు చెబుతున్నారు.. బెజవాడ పరిధిలోనే 2 కేసుల్లో సుమారు 80 మంది వరకు నిందితులుగా చేర్చారు పోలీసులు.. బెజవాడలో పటమట, గాంధీనగర్, నున్న, గుణదల రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భారీగా స్కాం జరిగినట్టు విచారణలో గుర్తించారు..
కాగా, నకిలీ చలాన్లతో ఏపీ ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన ఘటనలు అప్పట్లో కలకలం సృష్టించిన విషయం విదితమే.. నకిలీ చలాన్ల కుంభకోణం వెలుగుచూసిన తర్వాత రాష్ట్రంలో అన్ని సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో ఆన్ లైన్ ద్వారా అప్ లోడ్ చేసిన చలాన్లపై పరిశీలన కూడా జరిగింది.. 2020 జనవరి నుంచి అప్ లోడ్ చేసిన చలాన్ల తనిఖీల్లో మోసాలు బయటపడ్డాయి.. ఇక, 2021 జనవరి నుంచి నకిలీ చలాన్లతో మోసం జరిగినట్లు గుర్తించారు పోలీసులు..