జగిత్యాల జిల్లా…
జగిత్యాల పట్టణంలోని జగిత్యాల జిల్లా BRS పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నిర్వహించారు…
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…..
అబద్దాలతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ అవే అబద్దాలతో పాలన సాగిస్తోంది…!
లక్ష రుణమాఫీ చేశామని, చెబుతూనే, రూ 2 లక్షలు మాఫీ చేస్తున్నట్లు పత్రిక ప్రకటనలు…! ప్రకటనల కోసం కోట్ల రూపాయల విలువ చేసే ప్రకటనలు..!
రబీ, ఖరీఫ్‌లో చెల్లించాల్సిన రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టారు..! రుణమాఫీలో కోతపెట్టి రైతులను మోసం చేసారు..! పంట నష్టపరిహారం ఇవ్వకుండా అన్నదాతలను గోస పెట్టారు రేవంత్ సర్కార్‌ను..!
రైతు భరోసా పేరుతో రబీ, ఖరీఫ్ సీజన్లో రైతులకు, కౌలు రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు ఎందుకు ఇవ్వలేదు…?
ఖరీఫ్, రబీ సీజన్లో రైతులకు చెల్లించాల్సిన ‘రైతు భరోసా’సొమ్ము రూ.20 వేల కోట్లకుపైనే…! రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టి ఆ డబ్బులో కొంత భాగాన్ని రుణమాఫీకి మళ్లించి రైతులకు మేలు చేసినట్లు మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్…!
రైతుబంధు కింద జూన్‌లో ఇవ్వాల్సిన నిధుల నుంచే రూ.7,000 కోట్లు రుణమాఫీకి దారిమళ్లించి రైతులను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్..!
40 లక్షల పైచిలుకు రైతులు రూ.లక్ష వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందినే ఎట్లా ఎంపిక చేస్తారు..!
2014, 2018 లో కేసీఆర్ సర్కార్ రుణమాఫీతో పోలిస్తే పావు వంతు రైతులకే అర్హత ఉందా…?
2014లోనే కేసీఆర్ సర్కార్ లక్షలోపు రుణాలను మాఫీ చేయడానికి రూ.16,144 కోట్లు వెచ్చించ్చించి సుమారు 35 లక్షల రైతులకు లబ్ది చేకూర్చిందన్నారు..!
2018 లో అదే లక్షలోపు రుణమాఫీకి రూ.19,198 కోట్లు అంచనా కాగా మొత్తం లబ్ధిదారుల సంఖ్య సుమారు 37 లక్షలు..! యాసంగి రైతు బంధు లోనే 2 వేల కోట్లు ఎగ్గొట్టారు…! వానాకాలం రైతు భరోసా ఊసే లేదు.. కోటి 30 లక్షల ఎకరాలకు ఇస్తారనుకున్నా, ఎకరాకు రూ.7500 చొప్పున రూ.10 వేల కోట్లు ఎగ్గొట్టారు..!
పాస్ బుక్ ప్రామాణికమైతే మళ్ళీ రేషన్ కార్డు ఎందుకు..?
రుణమాఫీ కి రేషన్‌కార్డు నిబంధన పెడితే కుటుంబంలో రైతుకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది..! తద్వారా మరో 18 లక్షల మంది రైతులు తగ్గే అవకాశం ఉంది..! ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్‌కం ట్యాక్స్ చెల్లించేవారు ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మినహాయిస్తే, మరో 2 లక్షల మంది తగ్గుతారు…! వీరందరిని తొలగింపు ద్వారా 40 లక్షల మంది మేరకే రుణమాఫీ పథకం పరిధిలోకి వస్తారు…!
రేషన్ కార్డు ను ప్రామాణికంగా తీసుకుంటే యజమానికి భార్య, ఇద్దరు కుమారులు ఉంటే, వారికి పెళ్ళిళ్ళు అయి వేర్వేరు కాపురాలు ఉంటాయి, కానీ, 10 సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డులు జారీ కానందున వారికి రేషన్ కార్డులు లేవు, తండ్రి రేషన్ కార్డు మీదూవారి పేర్లు ఉంటాయి..! వాల్ల పేరు మీద భూమి ఉంటే వీరికి రుణమాఫీ వర్తిస్తుందా..లేదా…!
బ్యాంకుల నుండి తీసుకున్న ఆయా రుణాల మొత్తాన్ని చెల్లించి ‘డిఫాల్టర్ల’ జాబితా నుండి రైతులను తొలగించి కొత్తగా రుణాలు మంజూరు చేయించేలా చర్యలు తీసుకోవాలి..!
రైతుబంధు కింద జూన్‌లో ఇవ్వాల్సిన నిధుల నుంచే రూ.7,000 కోట్లు రుణమాఫీకి దారిమళ్లించి రైతులను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్..!
కాంగ్రెస్ మానిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు రూ.2 లక్షల వరకు ఉన్న పంటరుణాలు అన్నీ వెంటనే మాఫీ చేయాలి. అర్హులైన అందరు రైతులకూ రైతుబంధు విడుదల చేయాలి..!
రుణమాఫీ కి పట్టాదారు పాస్ బుక్ ప్రాతిపదిక అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టతా ఇచ్చారు…! దీనికి ప్రకారం పాస్ బుక్ ఉన్న ప్రతి రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి..!
ఒకే వేదికపై రుణమాఫీ గురించి మంత్రుల తలోమాట.. అబద్దాలు ఆడుతూ అడ్డంగా దొరికిన మంత్రులు..!
భట్టి విక్రమార్క రుణమాఫీకీ 6 వేల కోట్లు విడుదల….! తుమ్మల నాగేశ్వరరావు రుణమాఫీ కీ 31 వేల కోట్లు విడుదల అంటున్నారు..!
అనంతరం జగిత్యాల నియోజకవర్గంలోని 09 ఆలయాల అభివృద్ధి కొరకు తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా మంజూరైన 90 లక్షల అభివృద్ధి పత్రాలను దేవాలయాల కమిటీ సభ్యులకు అందజేసారు..
టిటిడి బోర్డు మెంబర్ గా వ్యవహరించిన సమయంలో నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి నిధులను మంజూరు చేసిన విద్యాసాగర్ రావు గారిని,కృషి చేసిన దావ వసంతసురేష్ గార్లను దేవాలయ కమిటీ సభ్యులు సన్మానించారు…
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, మాజీ మార్క్ ఫెడ్ ఛైర్మెన్ లోక బాపు రెడ్డి గారు, మాజీ జెడ్పీటీసీలు కొల్ముల రమణ, గొస్కుల జలంధర్, పాక్స్ ఛైర్మెన్ మాధవ రావు, మున్నూరు కాపు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్ల రమణ, కౌన్సిలర్లు అవారి శివకేసరి బాబు, శ్రీధర్ రెడ్డి, అనిల్, మహేందర్, సాయి, సత్యనారాయణ, పట్టణ ఉపాధ్యక్షులు వొల్లెం మల్లేశం, రాయికల్ మండల మహిళా అధ్యక్షురాలు స్పందన, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ ఉదయ శ్రీ,వైస్ చైర్మన్ మల్లేష్,నాయకులు శీలం ప్రవీణ్,చింతల గంగాధర్, పడిగెల గంగారెడ్డి, దయ్యాల మల్లారెడ్డి, ప్రతాప్, భగవాన్ రాజ్, నక్క గంగాధర్, గాజుల శ్రీనివాస్,బిఆర్ఎస్ పార్టీ కుటుంబసభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు…