దేశంలో ప్రాంతీయ పార్టీ ఆదాయాల్లో అగ్రస్థానం BRS పార్టీదే… ADR నివేదిక
న్యూ ఢిల్లీ :
ప్రాంతీయ పార్టీల ఆదాయ, వ్యయాలపై అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ తాజా నివేదిక వెల్లడించింది.2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రాష్ట్ర సమితి కు రూ.737.67 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించింది. ప్రాంతీయ పార్టీల్లో బీఆర్‌ఎస్ అగ్రస్థానంలో ఉందని తెలిపింది. దేశంలోని ప్రాంతీయ రాజకీయ పార్టీల ఆర్థిక స్థితిని విశ్లేషించిన ఏడీఆర్.. 57 ప్రాంతీయ పార్టీలకు గాను 39 పార్టీల ఆర్థిక స్థితిగతులను అంచనా వేసింది.
ఆదాయంలో భారాస తర్వాత రెండోస్థానంలో తృణమూల్ కాంగ్రెస్ నిలిచింది. టీఎంసీకి రూ.333.45 కోట్లు రాగా, డీఎంకేకు రూ.124.35 కోట్లు వచ్చినట్లు ఏడీఆర్ వెల్లడించింది. మొత్తంగా 39 ప్రాంతీయ పార్టీలకు రూ.1740.48 కోట్లు సమకూరగా.. వాటిలో ఐదు పార్టీలకే రూ.1541.32కోట్లు వచ్చినట్లు తెలిపింది. మొత్తం ఆదాయంలో 88.56శాతం వీటికే రావడం గమనార్హం.
ఇక వ్యయాల విషయానికొస్తే.. ఆల్‌ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (AITMC) మొదటి స్థానంలో ఉందని ఏడీఆర్ వెల్లడించింది. టీఎంసీ రూ.181.18 కోట్లు ఖర్చుపెట్టగా.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైకాపా) రూ.79.3