భారీ వర్షాలకు కూలిన భవంతి… ఇద్దరు మృతి

ముంబయి :

గత కొద్ది రోజులుగా ముంబయిలో కురుస్తున్న భారీ వర్షాలతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా శనివారం ఓ భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు.

అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం..  గ్రాంట్ రోడ్ రైల్వేస్టేషన్ సమీపంలో ఉదయం 10.30గంటలకు భారీ వర్షాల కారణంగా శనివారం ఓ భవనంలోని ఒక భాగం  కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపపడ్డారు.

భవనంలోని ఒక భాగం పూర్తిగా కూలిపోగా, మరికొంత భాగం ప్రమాదకరంగా వేలాడుతూ ఉంది. కాగా అగ్నిమాపక సిబ్బంది ఇప్పటి వరకు 13 మందిని రక్షించారు. భవనంలోని నివాసితులు శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని, వారిని బయటకు తీయడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు.