అమెరికా ప్రెసిడెంట్ రేసు నుంచి బైడెన్ ఔట్

అమెరికా ప్రెసిడెంట్ రేసు నుంచి బైడెన్ ఔట్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు బరిలోకి దిగిన జో బైడెన్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు.

ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

పార్టీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

తన నిర్ణయంపై త్వరలోనే వివరణ ఇస్తానని తెలిపారు.

కాగా బైడెన్ అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నేతల (డెమోక్రాట్లు) నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.