రాజకీయ విమర్శలు కట్టిపెట్టి ప్రాజెక్టు పునర్ వినియోగంలోకి తీసుకు రావడం పట్ల శ్రద్ధ పెట్టండి

తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజకీయ విమర్శలు కట్టిపెట్టి ప్రాజెక్టు పునర్ వినియోగంలోకి తీసుకు రావడం పట్ల శ్రద్ధ పెట్టండి… మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

కాళేశ్వరం ప్రాజెక్టు పై జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ సమావేశం ముగిసిన అనంతరం తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిల్లీలో పత్రికా సమావేశం నిర్వహించి కాళేశ్వరం ప్రాజెక్టుపై అవాకులు చెవాకులు పేలారు. తన అవగాహనా రాహిత్యాన్ని మరొక్కసారి బయటపెట్టుకున్నారు.

ఒకవైపు మేడిగడ్డ పునాదిని బలపరిచేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం అని అంటూనే మేడిగడ్డ వద్ద మట్టి పరీక్షలు సాధ్యపడలేదు అని అంటున్నాడు. ఈ ఏడాది మే 5న ఒక నివేదిక ఇచ్చిన NDSA, వర్షాకాలం వరదలు రాకముందే.. జులై మొదటి వారం లోపే పలు సాంకేతిక పరీక్షలు నిర్వహించాలని నివేదికలో పేర్కొన్నది. NDSA సూచనలతో.. జూన్ రెండో వారంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు CWPRS, CSMRS లతో సాంకేతిక పరీక్షలు చేయించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం రెండు సంస్థలు సాంకేతిక పరీక్షలకు ఉపక్రమించే సమయానికి వరద రావడంతో టెస్ట్ లు ఆపివేసినట్టు ఉత్తమ్ పేర్కొనడం గమనార్హం. ఈ వైఫల్యానికి NDSA నిర్లక్ష్య వైఖ