నేడే పార్లమెంటులో ఆర్థిక బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నిర్మలా సీతారామన్..
బడ్జెట్ పై భారీగా అంచనాలు..
న్యూఢిల్లీ :
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు ఉదయం 11 గంటలకు లోక్‌సభలో సాధారణ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు..
నేటి బడ్జెట్‌లో రైతులకు ఉపశమనం, ఉద్యోగస్తులకు ఆదాయపు పన్ను మినహాయింపు, వ్యాపారులకు రాయితీలు, పిఎల్‌ఐ పథకం పరిధిని విస్తరించడం మొదలైన వాటిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు భారీగా పెరిగే అవకాశం ఉంది. నేషనల్ హెల్త్ మిషన్, నేషనల్ హెల్త్ అథారిటీ, ఎయిమ్స్ హాస్పిటల్ కోసం బడ్జెట్ కేటాయింపు ఉంటుందని భావిస్తున్నారు.
బడ్జెట్‌లో ఉపాధి కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. పన్ను చెల్లింపుదారులకు పన్ను మినహాయింపు ప్రకటించే అవకాశం ఉంది.
వ్యవసాయం, స్టార్టప్‌లు, గృహ నిర్మాణం, రైల్వేలు, రక్షణ, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనంపై ఫోకస్ పెట్టాలని భావిస్తున్నారు. బడ్జెట్‌లో ఎన్‌పిఎస్, ఆయుష్మాన్ భారత్‌పై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.
పింఛన్ పథకాలపై రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. ఎన్‌పీఎస్, న్యూ పెన్షన్ సిస్టమ్ పై భారీగానే ఆశలు ఉన్నాయి..
నేడే కేంద్ర బడ్జెట్.. నిర్మలా సీతారామన్ రికార్డ్..
NDA ప్రభుత్వం పార్లమెంటులో మంగళవారం బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది.. ఇక, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ సరికొత్త రికార్డును నెలకొల్పనున్నారు. వరుసగా ఏడు సార్లు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ఘనత ఆమెకు దక్కనుంది. ఈ క్రమంలో ఆమె మొరార్జీ దేశాయ్ (6) రికార్డును బ్రేక్ చేయనున్నారు. అయితే, అత్యధిక సార్లు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ఘనత మాత్రం మొరార్జీ దేశాయ్ (10) పేరు మీదనే ఉంది..