కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మరోసారి అన్యాయమే జరుగుతుంది… మాజీ మంత్రి KTR

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మరోసారి అన్యాయమే జరుగుతుంది… మాజీ మంత్రి KTR

హైదరాబాద్‌ :

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ లో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్‌ పై తమకు ఎలాంటి ఆసక్తి లేదని ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ అన్నారు.

సాధారణంగా కేంద్ర బడ్జెట్ అంటే తమ రాష్ట్రానికి నిధుల కేటాయింపులు ఎలా ఉంటాయోనన్న ఆసక్తి ఉంటుంది. కానీ మోదీ సర్కార్ గత పదేండ్లుగా తెలంగాణపై సవితి తల్లి ప్రేమనే చూపుతున్నదని గుర్తు చేశారు.

తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడి కేంద్రం నుంచి సాయం అందాల్సినప్పటికీ ప్రధాని మోదీ ఎప్పుడూ అది పట్టించుకోలేదన్నారు. ప్రతి బడ్జెట్‌లో రాష్ట్రానికి మేలు చేసే కేటాయింపులు జరపాలని కోరినప్పటికీ పట్టించుకోలేదని విచారం వ్యక్తం చేశారు.

ఈ సారి బడ్జెట్‌లో తెలంగా ణకు కేటాయింపులు ఎలా ఉంటాయని నన్ను ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగాడు. దానికి తన సమాధానం ఈ సారి కూడా కేంద్ర బడ్జెట్ లో అదే పరి స్థితి ఉంటుందని మళ్లీ కేటాయింపులు గుండాసు న్నానే అని గట్టి నమ్మకం ఉందన్నారు.

అయితే ఈ సారి బీజేపీకి తెలంగాణలో ఎనిమిది ఎంపీ సీట్లు వచ్చాయి. కాబట్టి ఇక్కడి ప్రజలు మోదీపై, బీజేపీపై అభివృద్ధి చేస్తారని నమ్మకం పెట్టుకు న్నారు. కేంద్రంలో గెలిచే ప్రభుత్వానికి ఓట్లు వేస్తే రాష్ట్రానికి మంచి జరుగు తుందని భావించారు.

అందుకే బీజేపీకి 8 సీట్లు ఇచ్చారు. మరి ఈ ప్రాంత ప్రజల కోసం మన బీజేపీ ఎంపీలు మోదీతో మాట్లాడి ఏం మేలు చేసేలా చేస్తారో వేచి చూడాలి. మరి..

తనకు తెలిసి మోదీతో మన ప్రాంత ప్రయోజనాల కోసం మాట్లాడే సత్తా మన బీజేపీ ఎంపీలకు లేదు. కనుక ఎప్పటిలాగే తెలంగాణకు ఈ బడ్జెట్‌లోనూ గుండు సున్నానే అని కేటీఆర్ అన్నారు…