2024-2025 కేంద్ర బడ్జెట్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కామెంట్స్
2024- 2025 కేంద్ర బడ్జెట్లో ఏపీకి వరాల జల్లు..! తెలంగాణకు మొండిచేయి…!
2024 – 25 బడ్జెట్ అంచనాలు రూ.48.21 లక్షల కోట్లు…!
బీహార్‌కు రూ.41,000 కోట్ల ఆర్థిక సాయం అందించగా.. ఆంధ్రప్రదేశ్‌కు రూ.15,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టు పూర్తికి నిధులు సహా ఇతర నిధులు వచ్చాయి..!
ఈ బడ్జెట్ తో తెలంగాణ ప్రస్తావన రాకపోవడం దురదృష్ట కరం…!
బడ్జెట్ వేళ..! తెలంగాణా డిమాండ్లు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, నవోదయ, సైనిక్ స్కూల్లు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై కేటాయింపులు…!
తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులైన కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులలో, ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదాల పై కేంద్రం తెలంగాణ రాష్ట్రం పట్ల బడ్జెట్ తో వివక్ష చూపించింది..! హామీలు మాటలకే పరిమితం అయ్యాయి…!
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలు…! మూలధన వ్యయం కోసం ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీలో తెలంగాణకు నిధుల పెంపు, సింగరేణి కాలరీస్‌కు కొత్త బ్లాక్‌ల కేటాయింపు, స్మార్ట్ సిటీ మిషన్లపై బడ్జెట్లో కేటాయింపులు ఆశించినప్పటికీ.. కేంద్రం నుంచి మొండి చెయ్యే ఎదురైంది..!
సర్వేలు పూర్తయి ఉన్న 30 రైల్వే లైన్లకు నిధులు,కొత్త నవోదయ పాఠశాలలు, నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటుపైనా ఎలాంటి కేటాయింపులు జగరలేదు…!
బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం మాత్రం బడ్జెట్ కేటాయింపుల విషయంలో తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించినట్టు కనిపించడం లేదు..!
తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ ప్రజలు చెరో 8 ఎంపీ సీట్లను కట్టబెట్టారు..!
ఇద్దరు కేంద్ర మంత్రులు జి. కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సహా ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తగిన వాటాను పొందడంలో విఫలమయ్యారు..!