కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవటాన్ని నిరసిస్తూ అసెంబ్లీలో జరిగిన చర్చలో మాట్లాడిన KTR
KTR కామెంట్స్
గత పదేళ్లుగా అన్యాయం జరిగిందని మేము చెబుతున్నదే…ఇప్పుడు శ్రీధర్ బాబు గారు అక్కడ ఉండి చెప్పారు.
ఇక్కడున్న నాయకులకు సమాధానం చెప్పటానికి కేసీఆర్ గారు అవసరం లేదు
మేము మీ అందరికీ తప్పకుండా సమాధానం చెబుతాం.
ప్రభుత్వం తీర్మానం అని చెబుతూ దాని కాపీలను మాత్రం మాకు ఇవ్వలేదు
బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం పెట్టిన చర్చకు మేము సంపూర్ణ మద్దతిస్తున్నాం.
ముఖ్యమంత్రి గారికి సంయమనం, ఓపిక ఉండాలి. నన్ను మేనేజ్ మెంట్ కోటా అంటున్నారు.
నేను కూడా పేమెంట్ కోటాలో ఆయన సీఎం అయ్యారని అనవచ్చు.
అయ్యా, తండ్రి కోటా అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని అంటున్నారా? రాజీవ్ గాంధీ గారిని అంటున్నారా?
ప్రభుత్వం ప్రారంభించిన చర్చకు మేము వందశాతం మద్దతిస్తున్నాం. స్వాగతిస్తున్నాం.
అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మేము తెలంగాణ ప్రజల పక్షమే.
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మేము ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిస్తాం.
ఉమ్మడి ఏపీ లో తెలంగాణ పదాన్ని నిషేధించినట్లే…