అంతర్జాతీయ నేర లింకును హైదరాబాద్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఛేదించింది

హైదరాబాద్‌ :

అంతర్జాతీయ నేర లింకును హైదరాబాద్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఛేదించింది.

సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న మహ్మద్‌ ఇలియాస్‌, రిజ్వాన్‌, సయ్యద్‌ గులాంను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఇటీవల సైబర్‌ నేరగాళ్లు హైదరాబాద్‌కు చెందిన 75 ఏళ్ల వృద్ధుడి నుంచి రూ.5.40కోట్లు కాజేశారు. మనీలాండరింగ్‌ కేసులో డిజిటల్‌ అరెస్ట్‌ చేస్తున్నట్లు భయటపెట్టి..

బాధితుడి నుంచి విడతల వారీగా డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నారు. ఇందుకోసం ఈ ముగ్గురు నిందితుల బ్యాంక్‌ ఖాతాలనే సైబర్‌ నేరగాళ్లు వినియోగించారు.

అరెస్టైన ఈ ముగ్గురి వద్ద మొత్తం 17 బ్యాంక్‌ ఖాతాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఖాతాలో జమైన డబ్బును వీరు విత్‌డ్రా చేసి.. దుబాయిలో ఉన్న కీలక నిందితుడు ముస్తఫాకు క్రిప్టో కరెన్సీ రూపంలో పంపుతున్నారు.

అక్కడి నుంచి నగదు చైనాకు వెళ్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.